వాహన డిజైనింగ్‌, బ్యాటరీ నాణ్యత లోపాలే ఈవీలు అగ్ని ప్రమాదాల్లో పడటానికి కారణాలు !

వాహన డిజైనింగ్‌, బ్యాటరీ నాణ్యత లోపాలే ఈవీలు అగ్ని ప్రమాదాల్లో పడటానికి కారణాలు !

భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమలో పెను విప్లవం చోటు చేసుకుంటుంది.వినూత్నమైన ఆవిష్కరణలు చోటు చేసుకుంటుండటం మాత్రమే కాదు, విద్యుత్‌, కనెక్టడ్‌ వాహనాల పట్ల ఆసక్తి గణనీయంగా పెరిగింది.

వాహన డిజైనింగ్‌, బ్యాటరీ నాణ్యత లోపాలే ఈవీలు అగ్ని ప్రమాదాల్లో పడటానికి కారణాలు !

ఈ మార్కెట్‌ 2021లో మూడు రెట్లు పెరిగడం మాత్రమే కాదు ఈ పరిశ్రమకు ఓ టర్నింగ్‌ పాయింట్‌గా కూడా నిలిచింది.

వాహన డిజైనింగ్‌, బ్యాటరీ నాణ్యత లోపాలే ఈవీలు అగ్ని ప్రమాదాల్లో పడటానికి కారణాలు !

ఈ పరిశ్రమ 2022 సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే ఎన్నో రెట్ల వృద్ధిని సాధించింది.

వినియోగదారులలో అవగాహన పెరగడంతో పాటుగా అమ్మకాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.ఈ వృద్ధి , ఈవీ ల పట్ల దేశవ్యాప్తంగా పెరిగిన ఆసక్తి ఈ పరిశ్రమకు నూతనోత్తేజం అందించినట్లే, ఇటీవలి కాలంలో విద్యుత్‌ వాహనాలు అగ్ని ప్రమాదాలకు గురి కావడం వినియోగదారులలో నూతన సందేహాలకూ దారి తీసింది.

ఈ పరిశ్రమ వృద్ధికి ప్రతికూలంగానూ మారింది.నిజానికి ఈవీ వాహన వృద్ధిలో బ్యాటరీ అభివృద్ధి అత్యంత కీలకమని, వినియోగదారుల భద్రతను పరిగణలోకి తీసుకుని బ్యాటరీల రూపకల్పనకు తామెంతగానో కృషి చేస్తున్నామన్నారు ఎథర్‌ ఎనర్జీచీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ రవ్నీత్‌ ఎస్‌ ఫోఖేలా.

ఇప్పుడు భారతదేశంలో అమ్ముడవుతున్న ప్రతి 10స్కూటర్లలో ఒకటి ఈవీ స్కూటర్‌ అని రవ్నీత్‌ చెబుతూ, గత 12 నెలల కాలంలో గణనీయమైన వృద్ధి ఈ రంగంలో కనిపిస్తుందన్నారు.

ఇటీవలి కాలంలో ఈవీల పరంగా కొన్ని దురుదృష్టకర సంఘటనలు జరిగినా అమ్మకాల పరంగా క్షీణత ఏమీ లేదంటూనే ఈవీలలో ఎదురవుతున్న సమస్యలకు తక్షణమే తగిన పరిష్కారాలను కనుగొనకపోతే అది దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈవీలలో బ్యాటరీలు విఫలం కావడానికి ప్రధాన కారణం మన దేశ పరిస్ధితులకనుగుణంగా వాటిని ఓఈఎంలు డిజైన్‌ చేయకపోవడమేనని ఇటీవలి కాలంలో నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదే విషయాన్ని రవ్నీత్‌ కూడా అంగీకరిస్తున్నారు.ఆయనే మాట్లాడుతూ ఈవీ పరిశ్రమలో వృద్ధిని చూసి ఎలాంటి అవగాహన లేని వారు కూడా ఈ రంగంలో అడుగుపెడుతున్నారు.

అది పెద్ద సమస్య కాకపోయినా, భారతీయ పరిస్థితులకనుగుణంగా డిజైనింగ్‌, టెస్టింగ్‌, వాలిడేషన్‌ చేయకపోవడం పెద్ద సమస్యగా మారింది.

భారతీయ వాతావరణ పరిస్ధితులు దృష్టిలో పెట్టుకుని ప్రామాణిక నిబంధనలకు ఆవల మెరుగైన ప్రమాణాలను ప్రతి ఓఈఎం నిర్ధేశించుకుంటే ఈ సమస్య తీరే అవకాశాలున్నాయని ఆయన వెల్లడించారు.

ఎథర్‌ ఎనర్జీ ఆర్‌ అండ్‌ డీ, ఇంజినీరింగ్‌, టెస్టింగ్‌ పై తీవ్ర పరిశోధనలు చేసిందంటూ విభిన్న భారతీయ వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తమ వాహనాలను డిజైన్‌ చేశామన్నారు రవ్నీత్‌.

సేఫ్టీ అనేది తమ దగ్గర కేవలం చెక్‌బాక్స్‌ ఐటెమ్‌ కాదంటూ అది తమకు అది అతి ప్రధానమైన ఎంపికన్నారు.

తమ మొదటి వాహనం 2018లో విడుదల చేయడానికి ఐదేళ్ల ముందుగానే బ్యాటరీ ప్యాక్‌లను తాము నిర్మించామన్నారు.

తమ స్కూటర్లను ఒక లక్ష కిలోమీటర్లకు పైగా పరీక్షించడం జరిగిందంటూ అత్యంత కఠినమైన ప్రమాణాలను తాము అంతర్గతంగా నిర్ధేశించుకున్నామన్నారు.

తాము బ్యాటరీ ప్యాక్‌లను ఇతరుల వద్ద కొనుగోలు చేయమంటూ, తామే వాటిని ఫ్యాక్టరీలో తయారుచేస్తున్నామన్నారు.

ఓ స్టార్టప్‌ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ త్వరలోనే 4వ తరపు బ్యాటరీ ప్యాక్‌ విడుదల చేయబోతున్నామని ప్యాక్‌ లెవల్‌లో 120 పరీక్షలు, వాహన స్ధాయిలో దాదాపు 800 పరీక్షలు చేస్తామని, ఇవి కాకుండా మరిన్ని పరీక్షలు కూడా చేస్తున్నామన్నారు.

బ్యాటరీ ఒక్కటి బాగుంటే ఈవీ భద్రత బాగున్నట్లేనా అని అంటే ఈవీలకు గుండె లాంటిది బ్యాటరీ.

అది బాగుంటే చాలా వరకూ బాగున్నట్లే అని రవ్నీత్‌ అన్నారు.దేశంలో పెరిగే ఉష్ణోగ్రతలు ఈవీలు తగలబడటానికి కారణం కాదంటూ ఉష్ణోగ్రతలు పెరిగితే వాహన సామర్ధ్యం దెబ్బతింటుందన్నారు.

నాణ్యత పట్ల సరిగా శ్రద్ధ పెట్టకపోవడం, డిజైనింగ్‌ లోపాలు కూడా సమస్యకు కారణమవుతుందన్నారు.

ఈవీలు తగలబడుతున్న కాలం, పెరుగుతున్న పెట్రో ధరల నేపథ్యంలో ఈవీలను ఎలా ఎంచుకోవాలనేది ప్రశ్నే అయినా కాస్త శ్రద్ధ పెడితే వీటిని ఎంచుకోవడం తేలికేనన్నారు రవ్నీత్‌.

సవారీ చేసిన వెంటనే ఈవీలకు చార్జింగ్‌ పెట్టకూడదు, చార్జింగ్‌ పూర్తయిన వెంటనే ప్లగ్‌ తీసేయాలి లాంటి సూచనలన్నీ వాహన డిజైనింగ్‌ సరిగా లేని పరిస్థితుల్లోనే వస్తాయన్నారు.

బ్యాటరీ ప్యాక్‌ ట్యాంపర్‌ చేయకుండా ఉండటం, నాణ్యమైన, ఆధీకృత చార్జర్లు వాడటం, వాహనాలు రెగ్యలర్‌గా సర్వీస్‌చేయించడం చేస్తే ఎక్కువ కాలం ఇవి మన్నుతాయన్నారు.

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ‘ఎక్స్’ను అమ్మేశాడంట తెలుసా?

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. ‘ఎక్స్’ను అమ్మేశాడంట తెలుసా?