ఈ కూరగాయలు తింటే బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుందట?
TeluguStop.com
బెల్లీ ఫ్యాట్.ఇటీవల కాలంలో చాలా మంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.
శరీరం మొత్తం నాజూగ్గా ఉన్నా పొట్ట మరియు తొడల దగ్గర మాత్రం లావుగా ఉంటుంది.
దాంతో ఏ బట్టలు వేసుకున్నా అందహీనంగా కనిపిస్తారు.ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడం, వ్యాయమం చేయకపోవడం, మద్యపానం ఇలా రకరకాల కారణాల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి.
బెల్లీ ఫ్యాట్‌కు దారి తీస్తుంది.అయితే ఈ బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడంలో కొన్ని కొన్ని కూరగాయలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
మరి ఆ కూరగాయలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.క్యాప్సికం.
బెల్లీ ఫ్యాట్ కరిగించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.క్యాప్సికంలో ఉండే ప్రత్యేకమైన పోషకాలు.
శరీరంలోని అనవసరమైన కొవ్వులను కరిగించేస్తుంది.దాంతో బెల్లీ ఫ్యాట్ కూడా దూరం అవుతుంది.
కాబట్టి, క్యాప్సికంను కనీసం వారంలో రెండు సార్లు అయినా తీసుకోండి. """/"/
అలాగే పొట్ట కొవ్వును కరిగించడంలో గుమ్మడి కాయ కూడా ఉపయోగపడుతుంది.
గుమ్మడి కాయను కూరో, పచ్చడో చేసుకుని తరుచూ తినడం వల్ల.అందులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వును కరిగించి బెల్లీ ఫ్యాట్‌ను నివారిస్తుంది.
బెల్లీ ఫ్యాట్ ఉన్న వారే కాకుండా.సాధారణ వ్యక్తులు కూడా గుమ్మడి కాయను డైట్‌లో చేర్చుకుంటే ఊబకాయం బారిన పడకుండా ఉంటారు.
కాలీఫ్లవర్, క్యాబేజీలు కూడా బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టవచ్చు.కాలీఫ్లవర్, క్యాబేజీ తరచూ తీసుకోవడం వల్ల.
వాటిలో ఉంటే ఎంజైమ్స్, ఫైబర్ వల్ల శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కరుగుతుంది.
ఒబెసిటీ సమస్యలు దూరం అవుతాయి.ఇక బీరకాయ కూడా పొట్ట కొవ్వును తగ్గిస్తుంది.
బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువగా ఉంటాయి.ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
అందువల్ల బీరకాయను రసం రూపంలో తీసుకోవడం వల్ల.శరీరంలో ప్యాట్ తగ్గి బెల్లీ ఫ్యాట్ నుంచి ఉపశమనం పొందుతారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి23, గురువారం 2025