ఈ వెజిటేబుల్ ఫేస్ ప్యాక్స్‌తో య‌వ్వ‌నంగా మెరిసిపోండిలా!

వ‌య‌సు పెరిగినా య‌వ్వ‌నంగా, ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించాల‌ని అంద‌రూ కోరుకుంటారు.కానీ, మారిన జీవ‌న శైలి, ఆహార‌పు అల‌వాట్లు, కాలుష్యం ఇలా ప‌లు కార‌ణాల వ‌ల్ల పాతిక‌, ముప్పై ఏళ్ల‌కే య‌వ్వ‌న‌త్వాన్ని కోల్పోయి.

ముఖంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.దీంతో ఈ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తారు.

ఏవేవో ప్ర‌యోగాలు కూడా చేస్తుంటారు.ఎంతో ఖ‌ర్చు పెట్టి.

ఫేస్ క్రీములు కొనుగోలు చేసి ఉప‌యోగిస్తుంటారు.అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే బాధ ప‌డుతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే వెజిటేబుల్ ఫేస్ ప్యాక్స్ యూజ్ చేస్తే.ఖ‌చ్చితంగా య‌వ్వ‌నంగా మెరిసిపోవ‌చ్చు.

మ‌రి ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ముందుగా ఒక బంగాళ‌దంప‌ను తీసుకుని పీల్ తీసేసి లోప‌ల భాగాన్ని పేస్ట్‌లా చేసుకోవాలి.

ఆ పేస్ట్‌లో కొద్దిగా రోజ్ వాట‌ర్ మిక్స్ చేసి.ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.

ఒక అర‌గంట పాటు ఆర‌నిచ్చి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెండు రోజుల‌కు ఒక‌సారి చేస్తే.ముఖంపై ముడ‌త‌లు, మ‌చ్చ‌లు పోయి.

య‌వ్వ‌నంగా మారుతుంది. """/"/ రెండొవ‌ది.

ట‌మాటా తీనుసుకుని బాగా పేస్ట్ చేసుకుని అందులో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి మ‌రియు మెడ‌కు అప్లై చేసి.ఆరిపోనివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే.

ముఖంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌ల‌తో పాటుగా మొటిమ‌లు కూడా పోయి ప్ర‌కాశ‌వంతంగా మెరుస్తుంది.

మూడొవ‌ది.క్యాబేజీ ఆకులను పేస్ట్ చేసి రసాని తీసుకోవాలి.

ఆ త‌ర్వాత ఒక బౌల్‌లో క్యాబేజీ ర‌సం, శెనగపిండి మ‌రియు నిమ్మ‌ర‌సం వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా యువ్వ‌నంగా మెరిసిపోవ‌చ్చు.

MLC Kavitha Anil : తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవితతో అనిల్ ములాఖత్..!