భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధిగా వీరవెల్లి రాజేష్ నియామకం
TeluguStop.com
ఖమ్మం:భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధిగా వీరవెల్లి రాజేష్ ను నియమించినట్లు బిజెపి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తెలిపారు నియామక పత్రాన్ని విరవేల్లి రాజేష్ కు అందజేశారు
అనంతరం నియామకపత్రం అందుకున్న రాజేష్ మాట్లాడుతూ బిజెపి సిద్దాంతం,ఆదర్శాలకు పునరంకితమై,నీతి,నిజాయితీ , నిబద్ధత,క్రమశిక్షణ,చిత్త శుద్దితో వ్యవహరిస్తారని,పార్టీని సంస్థాగతంగా పటిష్ట పరచి అన్ని వర్గాలలో మరింత విస్తరించడానికి తమ వంతు కృషి చేస్తానన్నారు.
తమపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించినా పార్టీ అధిష్టానానికి , నాయకులకు,కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు .
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా జనరల్ సెక్రెటరీ రుద్ర ప్రదీప్ , పార్లమెంట్ కన్వీనర్ కనమర్లపూడి ఉపేందర్ , జిల్లా ఉపాధ్యక్షులు మంద సరస్వతి , జిల్లా కార్యదర్శి నకిరి కంటి వీరభద్రం , మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పాష , జిల్లా అధికార ప్రతినిధి వట్టి కొండ శ్రీనివాసు , వన్ టౌన్ మండల అధ్యక్షుడు పిల్లలమర్రి వెంకట్ , వన్టౌన్ మండల జనరల్ సెక్రటరీలు ఢీకొండ శ్యామ్ , గడిలా నరేష్ , జిల్లా నాయకులు రీగన్ ప్రతాప్ , బండారు శీను , రేపకుల సైదులు , దాసరి శివ , వూరుకొండ ఖాదర్ , బొల్లోజు మనోజ్ కుమార్ , దార్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు .
వైరల్ వీడియో: మనిషి ప్రయాణించే డ్రోన్ టాక్సీ తయారు చేసిన ఇంటర్ విద్యార్థి