వయస్సు 80 సంవత్సరాలు.. పీజీలు ఏకంగా 20.. ఈయన సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

సాధారణంగా 80 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు సంతోషంగా వృద్ధాప్యాన్ని గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు.

అయితే 80 సంవత్సరాల వయస్సు ఉన్న వీరాస్వామి( Veeraswami ) మాత్రం నిత్య విద్యార్థిగా ఇంకా చదువుతూ ఇప్పటికే 20 పీజీలు పూర్తి చేసి వార్తల్లో నిలిచారు.

ఆయన పేరు కంటే ఆయన డిగ్రీలే పెద్దగా ఉంటాయని చాలామంది ఫీలవుతారు.వీరస్వామి పూర్తి పేరు డాక్టర్ అంకతి వీరాస్వామి కాగా తెలంగాణలో వరంగల్ కు చెందిన ఈయన సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

ఓయూ నుంచి 3, కాకతీయ నుంచి 7, ఇందిరా గాంధీ వర్సిటీ నుంచి 4, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి 3, ఇతర యూనివర్సిటీల నుంచి 3 పీజీలు చేశారు.

తాజాగా ఆయన ఎం.ఏ ఆంత్రపాలజీ పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూస్తున్నారు.

1962 సంవత్సరంలో వీరాస్వామి హెచ్.ఎస్సీ పరీక్షలు( H.

Sc Exams ) పాస్ అయ్యారు.1968 సంవత్సరంలో ఆయన ఎయిడెడ్ స్కూల్ లో టీచర్ గా చేరారు.

"""/" / 1973 సంవత్సరంలో దూరవిద్య ద్వారా వీరాస్వామి బిఏ పూర్తి చేశారు.

1978 సంవత్సరంలో వీరాస్వామి బీఈడీ పూర్తి చేశారు.1981 సంవత్సరంలో ఒక ప్రొఫెసర్ మూడు పీజీలు పూర్తి చేశారని తెలుసుకున్న వీరాస్వామి దూరవిద్య ద్వారా వేర్వేరు యూనివర్సిటీలలో పీజీలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

పాతిక పీజీలు చేయాలనేది తన లక్ష్యమని ఆయన చెబుతున్నారు. """/" / 2002 సంవత్సరంలో వీరాస్వామి పదవీ విరమణ పొందారు.

ఆ తర్వాత వీరాస్వామి తన పేరుపై వరంగల్ లోని స్తంభంపల్లిలో ఏవీఎస్ పాఠశాలను నెలకొల్పారు.

తన పిల్లలు, శిష్యులు సైతం పీజీ పూర్తి చేసేలా ఆయన స్పూర్తి నింపడం కొసమెరుపు.

న్యూయార్క్ కు చెందిన ఒక వర్సిటీ వీరాస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది.

వీరాస్వామి ఈ జనరేషన్ లో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

వీరాస్వామి టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆ రీమేక్ ఆపాలంటూ 2 లక్షలకు పైగా ట్రోల్స్.. హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!