అమేజింగ్ మిస్టరీ : ఈ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చూసి ఉంటే వీరప్పన్ ఈ రోజు బ్రతికి ఉండేవాడు

వీరప్పన్.ఈనాటికీ ఈ పేరు చెప్తే భయపడని వారుండరు.

స‌త్య మంగ‌ళం అడివిని తన సామ్రాజ్యంగా చేసుకుని వీరపన్న సాగించిన మారణహోమం అంతా ఇంతా కాదు.

కేవలం వీరప్పన్ కారణంగా 200 మంది వరకు చనిపోయారు.వీరిలో వీరప్పన్ స్వయంగా 130 మందిని వరకు బలి తీసుకున్నాడు.

ఇక వీరప్పన్ ని పట్టుకునే క్రమంలో చాలా మంది పోలీసులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

అందుకే వీరప్పన్ ని చంపడానికి దక్షిణ భారతదేశ ప్రభుత్వాలు అన్నీ అంతలా కష్టపడ్డాయి.

వీరప్పన్ పేరు చెప్పగానే అందరికీ గంధ‌పు చెక్క‌లు, ఏనుగు దంతాలు గుర్తుకి వస్తాయి.

వీరప్పన్ వీటని రహస్యంగా అడవి నుండి బయటికి పంపేవాడు.ఇలా త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వాలకు తలనొప్పిగా మారి వందల కోట్లు సంపాదించాడు వీరప్పన్.

ఇక 2000లో కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశాడు వీరప్పన్.

ఆ సమయంలో వీరప్పన్ పేరు దేశమంతా మారు మోగిపోయింది.ఆ సమయంలోనే వీర‌ప్ప‌న్ పై 5 కోట్లు రివార్డ్ కూడా ప్రకటించారు.

అయినా., వీరప్పన్ ని పట్టుకునే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు.

దీనితో.కర్నాటక, త‌మిళ‌నాడు పోలీసులు వీరప్పన్ కోసం ఒకటయ్యారు.

ఇందుకోసం స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ పోలీస్ ను ఏర్పాటు చేసి 13 సంవ‌త్స‌రాలు సుమారు 100 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి వీరప్పన్ తుది ముట్టించాయి ప్రభుత్వాలు.

ఇందుకోసం SP విజ‌య్ కుమార్ ఆధ్వర్యంలో కొకూన్ అనే ఆపరేషన్ జరిగింది.ఆప‌రేష‌న్ కొకూన్ ని సక్సెస్ చేయడానికి ఓ పోలీస్ ఆఫీసర్ ఓ గూడెంలలో అంబులెన్స్ డ్రైవ‌ర్ గా తన ఐడెంటిటీ మార్చుకున్నాడు.

అక్కడ గూడెంలో ప్రజలతో కలసిపోయి చాలా సంవత్సరాలు కష్టపడి వాళ్ళకి దగ్గర అయ్యాడు.

అతని ఆంబులెన్స్ మీద Selam అని రాసి ఉంటుంది.అప్పట్లో దాన్ని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ఆ గూడెంలోకి వీరప్పన్ మనుషుల రాకపోకలు సాగుతూ ఉండేవి.అంబులెన్స్ డ్రైవర్ గా మారిన ఆ పోలీస్.

వీరప్పన్ అనుచరులకు దగ్గర అయ్యాడు.అలా వారి ద్వారానే వీరప్పన్ ని కూడా కలుసుకోగలిగాడు.

అలా చాలా నెలల పాటు., తన ఆంబులెన్స్ లో వీరప్పన్ ముఠాకి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చి ఇస్తూ వారి దగ్గర నమ్మకం ఏర్పరుచుకున్నాడు.

తరువాత కొంత కాలానికి వీర‌ప్ప‌న్ కు కంటిచూపు స‌మ‌స్య వచ్చింది.అతను దాన్ని లైట్ తీసుకున్నాడు.

కానీ., అంబులెన్స్ డ్రైవర్ మాత్రం ఆపరేషన్ చేయించుకోకుంటే కంటి చూపు పొద్దని వీరప్పన్ ని నమ్మించాడు.

తన ఆంబులెన్స్ లో తీసుకెళ్లి.తెలిసిన హాస్పిటల్ లో ఆపరేషన్ జరిగేలా చూస్తా అని వీరప్పన్ ని కి మాట ఇచ్చాడు.

బాగా నమ్మకస్థుడు కావడంతో వీరప్పన్ ఆ అంబులెన్స్ లో బయటకి రావడానికి ఒప్పుకున్నాడు.

అలా వీరప్పన్ ని ఎక్కించుకొని తమిళనాడు వైపు బయలుదేరాడు డ్రైవర్.ఇక ముందుగా అనుకున్న ప్రదేశానికి రాగానే డ్రైవ‌ర్ వేషంలో ఉన్న పోలీస్ బండిని రోడ్డు మీదే ఆపేసి, అంబులెన్స్ లో నుండి బయటికి దూకి పారిపోయాడు.

ఇక అప్పటికే ఆ ప్రదేశాన్ని చుట్టిముట్టి ఉన్న పోలీసులు ఆ ఆంబులెన్స్ పై కాల్పుల మొదలు పెట్టారు.

15 నిమిషాల పాటు., ఆగకుండా బుల్లెట్ల వర్షం కురిసింది.

ఆ కాల్పుల్లో వీరప్పన్ ప్రాణాలు కోల్పోయాడు.ఇదే ఆపరేషన్ కొకూన్.

కానీ., ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వీరప్పన్ ఆ ఆంబులెన్స్ పై ఉన్న Selam అనే పదాన్ని గమనించకపోవడం.

మాములుగా అయితే అక్కడ Salem అని పేరు ఉండాలి.కానీ.

, వీరప్పన్ ఈ తేడాని గమనించలేకపోయాడు.అతని ముఠా సభ్యులు కూడా ఈ పసిగట్ట లేకపోయారు.

పోలీసులు తొందరలో ఆ వ్యాన్ పై స్పెల్లింగ్ తప్పుగా రాయించారు.నిజానికి వీరప్పన్ ఇలాంటి విషయాల్లో చాలా షార్ప్ గా ఉండేవాడు.

తనకి ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే చంపేసేవాడు.అలాంటి వీరప్పన్ ఈ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ని గుర్తించలేకపోవడం వల్ల ప్రాణాలను కోల్పోయాడు.

ఇదే విచిత్రం మరి.

కేరళలో 278 కోట్ల రూపాయలతో సుమకు లగ్జరీ హౌస్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?