జనసేన తో పొత్తు పై వీర్రాజు వైరాగ్యం ?
TeluguStop.com
ఏపీలో బిజెపి, జనసేన పొత్తుపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో, ప్రస్తుతం పొత్తు కొనసాగిస్తున్న బిజెపి పరిస్థితి అయోమయంలో పడింది.
జనసేన లేకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది బిజెపి నేతలకు బాగా తెలుసు.
అయినా గంభీరంగానే ప్రకటనలు చేస్తూ, పవన్ కళ్యాణ్ టీడీపీ వైపు వెళ్లకుండా జాగ్రత్తలు పడుతున్నారు.
పోనీ పవన్ బిజెపితో పొత్తు రద్దు చేసుకున్నామని ప్రకటిస్తారా అంటే పవన్ మాత్రం ఈ విషయం లో నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారు.
"""/"/
ఇటీవల కొండగుట్ట లో పర్యటించిన పవన్ తాము బిజెపితోనే ఉన్నామంటూ వ్యాఖ్యానించారు దీంతో పవన్ విషయంలో ఏం చేయాలనే విషయంలో బిజెపి కూడా గందరగోళానికి గురవుతోంది.
ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలను బట్టి చూస్తే ఈ వ్యాఖ్యలు నిజమే అని అర్థమవుతుంది.
గత మూడు రోజులుగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటిస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు జనసేనతో పొత్తు వ్యవహారంపై స్పందించారు.
"""/"/
'' కలిసి వస్తేనే జనసేనతో పొత్తు.లేదంటే జనంతోనే మా పొత్తు " అంటూ మాట్లాడారు.
బిజేపి అగ్ర నేతలు పదే పదే పొత్తు విషయంలో పవన్ కి హిత బోధ చేస్తున్నా.
టీడీపీ తో జత కట్టవద్దు అంటూ ఒత్తిడి చేస్తున్నా.పవన్ మాత్రం టిడిపి వైపు చూస్తూ ఉండడం వంటివి బిజెపికి ఇబ్బందికరంగా మారాయి.
జనసేన విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైరాగ్యంలో ఉన్నట్టుగా ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
జనసేన తో పొత్తు వ్యవహారంపై ఏం చేసినా కేంద్ర బీజేపీ పెద్దలే చేయాలని, టీడీపీ వైపు పవన్ వెళ్లకుండా చూడాలనే ఆశాభావంతో వీర్రాజు ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..