200 మంది ఎంప్లాయిస్ ని తొలగించిన వేదాంతు..!

కరోనా లాక్ డౌన్ టైం లో బాగా పాపులర్ అయిన ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతూ తమ ఎంప్లాయీస్ కు పెద్ద షాక్ ఇచ్చింది.

లాస్ట్ ఇయర్ యూనికార్న్ హోదా కూడా దక్కించుకున్న ఈ కంపెనీ తమ కంపెనీ నుండి 200 మంది ఉద్యోగులను తీసేసింది.

వారిలో 120 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగా మిగతా 80 మంది పర్మినెంట్ ఉద్యోగులు.

సంస్థ వృధి ప్రణాళికలో భాగంగానే ఈ తొలగింపు ప్రక్రియ జరిగినట్టు వేదాంతాతు సంస్థ ప్రకటించింది.

2011 లో మొదలైన ఎడ్యుటెక్ స్టార్టప్ వేదాంతూ 2021లో జరిగిన ఈ రౌండ్ ఫండ్ రైజింగ్ లో భారీ పెట్టుబడులు సాధించి యూనికార్న్ హోదా పొందింది.

అయితే కంపెనీ ఆశించిన వృద్ధి లేకపోవడంతోపాటుగా ఫ్యూచర్ అవసరాల దృష్టిలో పెట్టుకుని వారి ప్లాన్స్ మార్చుకున్నారని తెలుస్తుంది.

అందుకే 200 మంది ఉద్యోగులను తీసివేసినట్టుగా చెబుతున్నారు.దేశవ్యాప్తంగా వేదాంతూలో 6000 ల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ఇదేకాదు ఇంతకుముందు మరో యూనికార్న్ ఎడ్యుటెక్ సంస్థ అన్ అకాడమీ కూడా తమ కంపెనీ నుండి 600 మంది ఉద్యోగులను తొలగించింది.

 ఈ ఆన్ లైన్ ట్యూషన్ వల్ల చాలామంది ఇంటి దగ్గర నుండే వారి అవసరాలకు అనుగుణంగా కావాల్సిన కోర్స్ లను తీసుకుంటున్నారు.

రీ రిలీజ్ ల విషయంలో చిరంజీవి ఇప్పుడున్న స్టార్ హీరోలతో పోటీ పడతాడా..?