హీరోయిన్ గా ఒక వెలుగు వెలగల్సిన ఈ నటి ఎందుకు ఇలా ఉండిపోయింది

గొప్పవారు కడుపున పుట్టినంత మాత్రాన ఎవరు గొప్పవారు కాలేరు.కేవలం వారికి ఉన్న టాలెంట్ లేదా లక్ మాత్రమే వారిని గొప్ప వారిగా నిలబెడుతుంది.

ఇది అచ్చు గుద్దినట్టుగా సినిమా పరిశ్రమకు చెందిన వారికి సరిపోతుంది.ఎందుకంటే చాలా మంది పేరు గడించిన సెలబ్రెటీస్ పిల్లలు ఆ పేరును కాపాడుకోలేక పోయారు.

పైగా వారి తల్లిదండ్రులకు ఉన్న పేరును వారి కెరియర్ కి ఏ మాత్రం ఉపయోగించుకోలేకపోయారు.

ఇలా చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు.అయితే ఎంతో అందం ఉండే టాలెంట్ అంతకన్నా గొప్పగా ఉండి కేవలం అదృష్టం కలిసి రాక ఒక స్టార్ సెలబ్రిటీస్ జంట ముద్దుల కుమార్తె హీరోయిన్ గా వెలుగు వెలగలేకపోయింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఆమె హీరోయిన్ గా రాణించలేక పోయింది అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / వేదాంతం రాఘవయ్య( Vedantam Raghavaiah ) మరియు సూర్యప్రభ( Suryaprabha ) దంపతుల కుమార్తె నటి శుభ.

( Actress Shubha ) వేదాంతం రాఘవయ్య అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొదటి హీరో.

అప్పటి ఏఎన్ఆర్, ఎన్టీఆర్ ల కన్నా కూడా గొప్ప నటుడు.వేదాంతం రాఘవయ్య భార్య ఆయన సూర్య ప్రభ కూడా మంచి నటి.

వీరిద్దరూ తొలితరం నటి నటులుగా స్థిరపడ్డారు.సూర్య ప్రభ గురించి చెప్పాలంటే ఆమె చెల్లెలు ప్రస్తుతం బాలీవుడ్ క్వీన్ రేఖ తల్లి అయినా పుష్పవల్లి.

రేఖకు( Rekha ) ఈ సూర్యప్రభ పెద్దమ్మ అవుతుంది.మరి ఈ రేఖ బాలీవుడ్ నీ దున్నేస్తుంటే శుభ మాత్రం హీరోయిన్ గా ఎదగలేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా చిన్న వయసులోనే నటించడం మొదలుపెట్టింది.

ఇక శుభ గురుంచి చెప్పాలంటే ఆమె చాలా అందంగా ఉంటుంది.అంతకన్నా మంచి అద్భుతమైన నటి కూడా.

అయితే తల్లిపాత్రల ద్వారానే బాగా గుర్తింపు తెచ్చుకుంది.ఆమె నటించిన పాత్రల విషయానికొస్తే ఘరానా మొగుడు( Gharana Mogudu ) సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఈ సినిమాలో చిరంజీవి తల్లి పాత్రలో నటించింది.అన్నమయ్య( Annamayya ) సినిమాలో కూడా నాగార్జునకు తల్లిగా కనిపించింది.

"""/" / గూడుపుఠాణి సినిమాలో కృష్ణ సరసన హీరోయిన్ గా కూడా నటించింది శుభ.

ఇదే ఆమెకు హీరోయిన్ గా మొదటి సినిమా.ఈ సినిమా తర్వాత చాలా కొద్ది కాలానికి ఆమె ఏ కారణాల చేతనో చాలా చిన్న వయసులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.

మన ఊరి పాండవులు, విజేత వంటి సినిమాల్లో కూడా ఆమె నటించింది.ఏప్రిల్ 1 విడుదల సినిమాలో కూడా ఆమె ఎంతో సహజంగా నటించింది.

తెలుగు వారు ఎక్కువగా ఆమెను గుర్తించకపోవడంతో ఆ తర్వాత కన్నడ మరియు తమిళ, మలయాళ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ గా మారింది.

ఇక హీరో శోభన్ బాబు కోడెనాగు సినిమా ఒరిజినల్ వర్షన్ అయిన కన్నడలో ఆమె హీరోయిన్ కావడం విశేషం.

ఇప్పుడు ఇలాంటి ఒక ఆర్టిస్ట్ అయితే ఉండటమే కష్టం.

అయ్యోయో.. మోకాళ్ల లోతు నీటిలో వధూవరులు.. చివరకు? (వీడియో)