తండ్రి బాటలో నడవాలనుకోవట్లేదు.. హీరో మాధవన్ కొడుకు కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మాధవన్ గురించి ఈ తరం వారికీ అంతగా పరిచయం లేకపోయినా, అప్పట్లో ఈయన ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు.
ఇక మాధవన్ కుమారుడు వేదాంత్ గురించి కూడా మన అందరికి తెలిసిందే.అది చిన్న వయసులోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
మాధవన్ కుమారుడు వేదాంత్ నేషనల్ లెవెల్ స్విమ్మింగ్ ఛాంపియన్ అన్న విషయం విధితమే.
అయితే చాలామంది హీరో మాధవన్ కుమారుడు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తారు అని అనుకున్నారు.
కానీ వేదాంత మాత్రం తండ్రి జడలు నడిచేందుకు సిద్ధపడటం లేదట.తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి అని తాపత్రయ పడుతున్నాడు.
వెండితెరపై కంటే స్విమ్మింగ్ పూల్ లోనే మాధవన్ కుమారుడు తన భవిష్యత్తును చూసుకుంటున్నాడు.
కోహెన్ హెగ్ లో జరిగిన డేనిష్ ఓపెన్ స్విమ్మింగ్ పూల్ పోటీలలో మాధవన్ కుమారుడు వేదాంత్ బంగారు వెండి పతకాలను సాధించాడు.
ఇదిలా ఉంటే తాజాగా మీడియాతో ముచ్చటించిన వేదాంత్ మాట్లాడుతూ.తాను తన తండ్రి నీడలో బతకాలని అనుకోవడం లేదని, తనకంటూ సొంతంగా ఓ గుర్తింపును సంపాదించుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు.
"""/" /హీరో మాధవన్ కొడుకుగా నేను ఉండిపోవాలని అనుకోవడం లేదు.మా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా నన్ను సంరక్షిస్తూనే వస్తున్నారు.
నాకు ఏది కావాలో అది సమకూరుస్తూనే ఉన్నారు.నా కోసం వారు ఏకంగా దుబాయ్ కూడా షిఫ్ట్ అయ్యారు అని చెప్పుకొచ్చాడు.
నాకోసం మా తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు.నేను 2026 లో జరగబోతున్న ఒలింపిక్ క్రీడలకు నేను సిద్ధం అవ్వడానికి దుబాయ్ కి షిఫ్ట్ అయ్యామని వేదాంత్ తెలిపాడు.
ఒక వేదాంత్ మాటల పై స్పందించిన మాధవన్ తన కొడుకు సినిమాల్లోకి రానంత మాత్రాన హీరో అవ్వన్నంత మాత్రాన తనకు బాధగా లేదని మాధవన్ చెప్పుకొచ్చాడు.