అనుకూల దాంపత్యం కోసం పడక గదిలో మంచం ఏ దిశలో ఉండాలో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే పడక గది( Bed Room ) దక్షిణా లేదా నైరుతి మూలలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఈ దిశ మంచం కోసం అనుకూలమైన దిశగా పరిగణించబడుతుంది.మంచం తల ద్వారం వైపుకు ఉండకూడదు.

బెడ్ రూమ్ కోసం ప్రకాశవంతమైన రంగులను ఎంచుకోవాలి.ఎందుకంటే అవి చాలా ఉత్తేజ కరమైనవిగా ఉండాలి.

ముఖ్యంగా చెప్పాలంటే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి గోడల పై కాంతివంతమైన, కంటికి హాయిని కలిగించే రంగులను ఉపయోగించడం మంచిది.

"""/" / అలాగే నైరుతి దిశలో ఉన్న పడక గదికి పింక్ లేదా పీచ్ రంగులు ప్రత్యేక లుక్ ను ఇస్తాయి.

వాస్తు శాస్త్రం( Vastu ) ప్రకారం పడక గదిలోకి నీలం రంగు అందం, నిజాయితీ మరియు అంకిత భావానికి చిహ్నంగా భావిస్తారు.

అదే సమయంలో లేత ఆకుపచ్చ రంగు ఆనందకరమైన వాతావరణాన్ని ఇస్తుంది.పగటి పూట సహజ కాంతి( Natural Light ) పడక గదిలోకి ప్రవేశించేలా నిర్మించుకోవాలి.

ఎందుకంటే సహజమైన కాంతి సానుకూల శక్తిని ఇస్తుంది.అదే విధంగా సాయంత్రం పడక గదిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి మృదువైన లైటింగ్ ఉండేలా చూసుకోవాలి.

ప్రకాశమంతమైన కాంతిని నివారించడం ఎంతో మంచిది. """/" / ఇంకా చెప్పాలంటే పడకగదిలో లేత నీలం లేదా పింక్ లైటింగ్ ఉండడం వల్ల వాతావరణం మరింత ప్రశాంతంగా ఉంటుంది.

పడక గదిలో అసలు అద్దాలు ( Mirrors ) పెట్టకూడదు.ఒక వేళ అద్దం బెడ్రూంలో ఉన్నట్లయితే నిద్రపోయే సమయంలో వాటికీన్నీ కవర్ చేసుకోవడం ఎంతో మంచిది.

ఎందుకంటే అద్దం అల్లకల్లోలాన్ని సృష్టించగలదు.శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా మంచం ముందు అద్దం ఉండకూడదు.

అద్దం ఎంత పెద్దదైన దంపత్య బంధంలో అంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.

అంతే కాకుండా పడక గదిలో అలంకరణ వస్తువులను అస్సలు ఉంచకూడదు.అందుకు బదులుగా జంట పక్షుల చిత్రాలను ఎంచుకోవడం ఎంతో మంచిది.

డిగ్రీ అర్హతతో విదేశాల్లో ప్రభుత్వ ఉద్యోగం.. ఈ యువతి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!