వంటగది ఈ వాస్తు నియమాలను పాటించకపోతే.. మీ జేబులు ఖాళీ అయినట్లే..

ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఉన్న ప్రతి ఇంట్లో వంట గది( Kitchen Room )కి ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.

ఇంటి వంట గదికి సంబంధించిన వాస్తును కచ్చితంగా పాటించాలి.ఎందుకంటే ఈ నియమాలను పాటిస్తే కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

అలాగే వంట గదిలో ఏదైనా లోపం ఉంటే అది ఇంటి కుటుంబ సభ్యులపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.

వాస్తు శాస్త్రంలో ఇంటి పూజ గది( Pooja Room ) తర్వాత వంట గదికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.

వంట గదికి సంబంధించిన వాస్తు నివారణలు సకాలంలో చేస్తూ ఉండాలి. """/" / లేకుంటే అశుభ ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

అందుకోసం వాస్తు శాస్త్రం ప్రకారం( Astrology ) వంట గది ఎప్పుడు ఆగ్నేయ దిశలో ఉండేలా చూసుకుంటారు.

అంతే కాకుండా వంట గది నీ వాయువ్య దిశలో కూడా నిర్మించవచ్చు.వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా వంటగదిని ఉత్తర దిశలో నిర్మించకూడదు.

నైరుతి మరియు ఈశాన్య దిశలో కూడా వంటగదినీ నిర్మించకూడదు.వాస్తు శాస్త్రం ప్రకారం వంట గదిని దక్షిణ దిశలో నిర్మిస్తే ఎప్పుడూ తూర్పు దిశలో పొయ్యి ఉంచకూడదు.

అలాగే వంటగదిలో పాత్రలు కడగడానికి ఎప్పుడూ వాయువ్య దిశలో ఉండేలా చూసుకోవాలి. """/" / వంట గదిలో డైనింగ్ టేబుల్( Dining Table ) ఉంచకూడదు.

అవసరమైతే మీరు దానిని పశ్చిమ దిశ లేదా వాయువ్య దిశలో మాత్రమే ఉండేలా చూసుకోవాలి.

వాస్తు ప్రకారం వంటగదిలో ధాన్యాలు ఉంచాలంటే పశ్చిమ లేదా దక్షిణ దిశ మంచిదని పండితులు చెబుతున్నారు.

అలాగే ఇంట్లో భూమి, ఆకాశం, గాలి, అగ్ని, నీరు యొక్క మూలకాల యొక్క సరైన సమతుల్యత ఉండేలా చూసుకోవాలి.

అగ్ని మూలాల స్థానం ఆగ్నేయ దిశలో ఉండాలి.ఇలా వంటగది వాస్తు నియమాలను పాటించకపోతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోక తప్పదు.

కాబట్టి ఈ వాస్తు నియమాలను కచ్చితంగా పాటించడం మంచిది.

బోలెడంత టాలెంట్ ఉండి చేజేతులా కెరియర్ నాశనం చేసుకున్న నివేద థామస్..!