దీపావళి పండుగ రోజున పాటించాల్సిన వాస్తు నియమాలివే!!

మన భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు.మన దేశంలో ఎన్నో కులాలు మతాలు ఉన్నప్పటికీ అన్ని కులాలకు,మతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకునే పండుగలలో దీపావళి ముందు వరుసలో ఉంటుంది.

ఈ పండుగను ప్రజలు అందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటారు.ఈ దీపావళి పండుగను చెడును అంతం చేసి విజయాన్ని తీసుకురావడంతో, విజయానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు.

ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపే ఈ పండుగ ఆధ్యాత్మిక, శారీరక సంబంధాలను పెంపొందిస్తుంది.

ఈ పండుగను మన ఇంట్లో ఆనందంగా జరుపుకోవాలి అంటే తప్పకుండా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు.

"""/" / సాధారణంగా ఏవైనా పండుగలు వస్తున్నాయంటే మొదటిగా మన ఇంటిని శుభ్రం చేసుకుంటాము.

దీపావళి పండుగ మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది అని భావించి మన ఇంటిని ,శుభ్రం చేసుకుని ఆ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు.

ఆ లక్ష్మీదేవికి పూజలు చేయటం ద్వారా మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల వాతావరణం తొలగిపోయి సానుకూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉన్న పాత బట్టలు, విరిగిపోయిన వస్తువులను మన ఇంట్లో నుంచి బయటకు పడేయాలి.

ఈ పండుగ ఉద్దేశం చెడు చేసే విషయాలను వదిలించుకొని నూతన వస్తువులను మన ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని అర్థం.

"""/" / దీపావళి పండుగ అంటేనే దీపాల అలంకరణ తో మొదలవుతుంది.రంగు రంగు దీపాలు వెలిగిస్తూ ఈ పండుగను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు.

ఈ దీపాలను మన ఇంటి నలుమూలల వెలిగించడం ద్వారా మన ఇంట్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి.

పూర్వం నుంచి మట్టి దీపాలను వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ దీపాలను నువ్వుల నూనె లేదా నెయ్యితో వెలిగించవలెను.

అలాగే ఇంటి ద్వారం వద్ద వివిధ రకాల రంగురంగుల లైట్లతో అలంకరించాలి. """/" / మన పురాతన గ్రంథాల ప్రకారం వాస్తు దోషాన్ని సరిదిద్దడానికి శ్రీ యంత్రాన్ని ఉపయోగిస్తారు.

ఈ యంత్రాన్ని ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత దోషాలను తొలగించడానికి ఉపయోగిస్తారు.భక్తులు ఈ యంత్రాన్ని పూజించినప్పుడు వారు ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని ప్రగాఢ విశ్వాసం.

"""/" / దీపావళి సందర్భంగా మనం ప్రత్యేకంగా లక్ష్మీ పూజను నిర్వహిస్తాము.లక్ష్మీ పూజతో పాటు, కుబేర పూజ కూడా నిర్వహిస్తారు.

ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఈ కుబేరునికి ఎంతో ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు.లక్ష్మీదేవి శ్రేయస్సుకు సంపదకు ప్రతిరూపం అయితే ఆ సంపదకు నిర్వాహకుడిగా, రక్షకుడిగా కుబేరుడు ఉంటాడు.

ఈ ఏడాది దీపావళి నవంబర్ 14న రావడంతో సాయంత్రం 5:28 గంటల నుంచి7:24 వరకు లక్ష్మీ పూజలు నిర్వహించడానికి సరైన సమయమని పురోహితులు తెలియజేస్తున్నారు.

మహిళల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..!