అద్దె ఇంటి కోసం కూడా వాస్తు నియమాలను అనుసరించాలా..!

మన దేశంలో ఉన్న చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని( Vastu ) గట్టిగా నమ్ముతారు.

అలాగే కొంతమంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని అసలు నమ్మరు.వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు తమ ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

అలాగే ఇంట్లోనే వస్తువులను కూడా వాస్తు ప్రకారం అలంకరించుకుంటూ ఉంటారు.సొంత ఇళ్లు అయితేనే వాస్తు నియమాలు పాటించాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఇది ఏమాత్రం సరైన ఆలోచన కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే ఆ ఇంటి వాస్తు సరిగా ఉన్నప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది.

సొంతింటి కల నెరవేరాలంటే అప్పటివరకు అద్దెకు ఉండే ఇల్లు కూడా వాస్తు రీత్యా బాగుండాలని చెబుతున్నారు.

"""/" / మీరు ఉండేది ఊర్లో అయినా, పట్టణంలో అయినా, అపార్ట్మెంట్ అయినా వాస్తు నియమాలు( Vastu Tips ) పాటించడం ముఖ్యమని చెబుతున్నారు.

వాస్తు అద్భుతంగా లేకపోయినా కనీసం కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.

వాటిని కనుక పాటించకపోతే మీ జీవితం అదే ఇంటికే పరిమితం అవుతుందని చెబుతున్నారు.

అన్నీ విధాలుగా సరైన ఇంట్లో అద్దెకు( Rent House ) ఉంటే ఆస్తులు కలిసి రావడమే కాకుండా సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది.

అద్దె ఇంట్లో తీసుకోవాల్సిన వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈశాన్యంలో ద్వారం, గృహం మధ్యలో ఖాళీ ఉండడం ఎంతో ముఖ్యం.

ఆగ్నేయంలో వంటగది ఉండాలి. """/" / నైరుతిలో బాల్కనీ( Balcony ) ఉండకూడదు.

ఇల్లు దిక్కులు క్రాస్ గా ఉండకూడదు.నైరుతి, దక్షిణ, పశ్చిమ వైపున మాస్టర్ బెడ్ రూమ్ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి.

ప్రతి పోర్షన్ దీర్ఘ చతురస్రాకారంలో ఉండాలి.వృత్తాకారంలో అసలు ఉండకూడదు.

నైరుతిలో ద్వారం ఉండకూడదు.ఇంటి ఆవరణలో నూతులు, గోతులు వాస్తు అనుగుణంగా ఉండాలి.

వీధి పోట్లు, రోడ్డు నుంచి పల్లంగా ఉన్న ఇల్లు మంచివి కాదు.కొన్ని వీధిపోట్లు కలిసి వస్తాయి.

బాత్రూలు దక్షిణా, పశ్చిమ దిశలలో ఉండడం మంచిది.అలాగే అద్దె ఇంట్లో ముందు ఉన్న వారికి కలిసి వచ్చిందా లేదా మరింత నష్టపోయారా అనేది కూడా తెలుసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే అనారోగ్య సమస్యలు, ఆత్మహత్యలు, కుటుంబంలో కలహాలు ఏమైనా జరిగయా అని తెలుసుకోవడం ముఖ్యం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్1, శుక్రవారం 2024