వాసంతిని అంత మాట అనేశాడు ఏంటి.. మేకప్ తప్ప గేమ్ లేదంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు బిగ్ బాస్ కంటెస్టెంట్ వాసంతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె తెలుగులో ప్రసారమవుతున్న బిగ్బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా పాల్గొని తాజాగా పదవ వారం ఎలిమినేషన్స్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత వాసంతి బిగ్బాస్ కేఫ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వాసంతిని తన ప్రశ్నలతో ఒక ఆట ఆడుకోవడంతో పాటు వాసంతి పరువు తీసేసాడు.

అందంలో బుట్టబొమ్మ.ఆటలో ఉత్త బొమ్మ అంటూ ఎంట్రీలోనే వసంతి పరువుతీశాడు యాంకర్ శివ.

ఎలిమినేషన్ అయ్యావ్.ఇంత కూడా బాధపడటం లేదు అని యాంకర్ శివ అనగా ఫేస్ మీద కనిపిస్తేనే బాధ అని కాదు.

లోపల కూడా ఉంటుంది అంటూ వాసంతి రిప్లై ఇచ్చింది.అప్పుడు శివ వాసంతి ఆర్మీ, వాసంతి ఫ్యాన్స్ అని ఇంత ఫ్యాన్ బేస్ రావడానికి మీరేం చేశారు అంటూ ప్రశ్నించగా.

అది మీరే చెప్పాలి.నేను ఇప్పుడే బయటకు వచ్చాను అని అంటుంది వాసంతి.

మేకప్ వేసుకుని, నీట్‌గా రెడీ అవ్వడం తప్పా ఇంక గేం ఏమీ ఆడలేదు అని శివ అనగా వెంటనే వాసంతి బిగ్ బాస్ ఇంటికి ఏమేం కావాలో అన్నీ చేశాను అని అంటుంది.

"""/"/ ఇంట్లోకి వెళ్లేముందు చాలా అల్లరి చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను అని అన్నావ్.

ఏం చేశావ్ నువ్.ఏం ఎంటర్టైన్ చేశావ్.

అల్లరి చేశావ్ అని యాంకర్ శివ అడగగా ఏం చేయకపోతే జనాలకు నచ్చకపోతే ఇన్ని రోజులు ఉండేదాన్ని కాదు అంటూ శివ కి దిమ్మ తిరిగే విధంగా సమాధానం ఇచ్చింది.

ఇన్ని రోజులు నెట్టుకొస్తానని అనుకున్నావా? అని శివ అడిగితే.అనుకున్నాను.

ఇంకా ఉంటానని కూడా అనుకున్నా అని వాసంతి తెలిసింది.వందుకు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావ్ అని అడిగితే.

డెబ్బై అని అనగా ఎందుకు వంద ఇచ్చుకోలేరా? అని శివ ఎదురు ప్రశ్నిస్తాడు.

నాకు కాన్ఫిడెన్స్ఉంది.కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు అంటుంది వాసంతి.

సెంట్రల్ అమెరికా: నికరాగ్వాలో మంత్రాలు నేర్చిన కోతి.. ప్రజలను వెంటాడుతోందట..!