స్టాండప్ రాహుల్ ఈవెంట్ లో వరుణ్ తేజ్.. అతని గొంతు వింటే?

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్,వర్ష బొల్లమ్మ కలిసి నటించిన తాజా చిత్రం స్టాండప్ రాహుల్.

ఈ సినిమా ఫిబ్రవరి 18 న విడుదల కానున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో భాగంగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.తన గొంతు బాగా లేదని, కాబట్టి ఈ రోజు తనను భరించింది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు.

అనంతరం సినిమా గురించి మాట్లాడుతూ.ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ముందుగా అందులో శాంటో గురించి చెప్పాలి అంటూ సినిమా కథ గురించి తెలిపారు వరుణ్ తేజ్.

అలాగే రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ లు పర్ఫెక్ట్ ఛాయిస్.ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అయినప్పటికీ తనకు ఉన్న ఫ్యాషన్ కోసం ఈ ఫీల్డ్ లోకి వచ్చిన రాజ్ తరుణ్ కు ఆల్ ది బెస్ట్.

అదేవిధంగా ఆ రాజ్ తరుణ్ నేను ఇద్దరు కలిసి ఒకే సమయంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాము.

మేము ఇద్దరు ఎన్నో విభిన్న రకాల సినిమాలు చేశాము అని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

ఇక రాజ్ తరుణ్ నటించిన తాజా సినిమా దివ్య సినిమా లా ఉంది.

ఇందులో రాజ్ తరుణ్ ఎంతో యంగ్ గా కనిపించాడు. """/" / అదే విధంగా హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాను కూడా చూశాను అందులో ఆమె అద్భుతంగా నటించింది ఇందులో కూడా బాగా నటించింది అని తెలిపారు వరుణ్ తేజ్.

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం వరుణ్ తేజ్ గని, ఎఫ్ 3 సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలకు డబ్బింగ్ చూపి అలా గొంతు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.ఇక వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

పన్నూన్‌ హత్యకు కుట్ర కేసు : అనుమానితుడు నిఖిల్ గుప్తాని అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్