వర్క్ ఫ్రమ్ హోమ్ అంటోన్న బాక్సర్
TeluguStop.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన తాజా చిత్రం బాక్సర్ కోసం తెగ కష్టపడుతున్నాడు.
ఇప్పటికే అనౌన్స్ చేసిన ఈ సినిమా కోసం బాక్సింగ్‌లో ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు ఈ మెగా హీరో.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇంటికే పరిమితం కావాలని పలు దేశాలు సూచిస్తున్నాయి.
ఈ క్రమంలో తాను కూడా ఇంటికే పరిమితం అవుతున్నానంటూ బాక్సర్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోని జిమ్‌లు కూడా మూసి వేయడంతో ఇంటి వద్దనే ట్రెయినింగ్ తీసుకుంటున్నాడు వరుణ్ తేజ్.
దీనికి సంబంధించిన ఓ ఫోటోను పెట్టి ట్వీట్ చేశాడు.ఇంటి వద్దనే బాక్సింగ్ చేస్తూ ఎండలో చెమటోడుస్తున్నాడు.
అందరూ ఇంటివద్దనే ఉంటూ పని చేసుకోవాలని, ఇంటి వద్ద ఉండటమే ప్రస్తుతం సురక్షితం అని ఆయన అన్నాడు.
కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీని అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
ఇక ఈ సినిమాలోని మిగతా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.అల్లు బాబీ మరియు సిద్ధు ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ పరిస్థితి ఇలా అయిపోయింది ఎంటి..మళ్ళీ ఆ మ్యాజిక్ చేస్తాడా ?