విడుదలకు ముందు మెగా మూవీకి కోర్టు చిక్కులు

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన 'వాల్మీకి' చిత్రం మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ విలన్‌గా నటించిన విషయం తెల్సిందే అధర్వ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రమోషన్స్‌ మొదలు పెట్టారు.

ఈ సమయంలో భోయ జాతికి చెందిన వారు కోర్టును ఆశ్రయించారు.తమ జాతికి చెందిన వాల్మీకి పేరును సినిమాకు పెట్టడం వల్ల తమ మనోభావాలు దెబ్బ తీసినట్లుగా అయ్యిందని వారు కోర్టు ముందు పేర్కొన్నారు.

"""/"/ హీరో వరుణ్‌ తేజ్‌ మరియు హరీష్‌ శంకర్‌లు వెంటనే క్షమాపణలు చెప్పి టైటిల్‌ మార్చి సినిమాను విడుదల చేసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

సినిమా విడుదలపై స్టే విధించాలని కూడా కోర్టులో సదరు సంఘం నాయకులు పిటీషన్‌ వేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో హరీష్‌ శంకర్‌ హైరానా పడుతున్నాడు.ఏం చేయాలో పాలుపోక రాజీకి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

వాల్మీకి టైటిల్‌ను మార్చే ఉద్దేశ్యం అయితే తనకు లేదంటూ ఆయన పేర్కొన్నాడు.తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన జిగర్తాండ చిత్రానికి ఇది రీమేక్‌ అనే విషయం తెల్సిందే.

జిగర్తాండ చిత్రం జాతీయ అవార్డును దక్కించుకుంది.అందుకే ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై కోర్టులో కేసు నమోదు అవ్వడం వల్ల చర్చ మొదలైంది.

సినిమా విడుదల సమయంలో పరిస్థితి మరెంత సీరియస్‌గా ఉంటుందోనన్న ఆందోళన అయితే కనిపిస్తుంది.

బండి భగీరథ్ కనిపిస్తే సమాచారం ఇవ్వండని హైదరాబాద్ మెట్రోలో ప్రచారం