మట్కా కోసం ఇష్టంలేని పనులు కూడా చేశాను.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!
TeluguStop.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej ) నటించిన మట్కా సినిమా( Matka Movie ) నవంబర్ 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ సినిమా విడుదలకు కేవలం ఒకరోజు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.
ఇప్పటికే వైజాగ్ లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఇక ఇటీవల చిత్ర బృందం తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్న విషయం మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వరుణ్ తేజ్ ఈ సినిమా గురించి పలు విషయాలను వెల్లడించారు.
"""/" /
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ వరుణ్ తేజ్ ను ప్రశ్నిస్తూ ఈ సినిమా విషయంలో మీ ప్రమేయం ఎలా ఉందని అడిగారు.
ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ ప్రతి ఒక్క సినిమా విషయంలో డైరెక్టర్లు అందరూ ఒకేలా ఉండరు కొంతమంది ఏం మాట్లాడకుండా వారి పనులు వారు చేయించుకుంటారు కానీ మరికొందరు ఎక్కువగా మాట్లాడుతూ అన్ని పనులు చేయించుకుంటారని తెలిపారు.
ఇక మట్కా సినిమా కోసం తాను కూడా ఎన్నో నాకు ఇష్టం లేని పనులు చేశానని తెలిపారు.
"""/" /
ఈ సినిమా ప్రమోషన్ల కోసం పిఆర్ఓలు నాకు ఇష్టం లేకపోయినా నా చేత కొన్ని పనులు చేయించారని తెలిపారు.
నిజానికి నాకు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం ఉండదు నేను చాలా తక్కువగా మాట్లాడుతాను కానీ ఈ సినిమాని అందరిలోకి తీసుకువెళ్లడం కోసం తాను వేదిక పైకి వెళ్లి తప్పనిసరిగా ఎక్కువ సేపు మాట్లాడాలని గట్టిగా మాట్లాడాలని పిఆర్ఓలు చాలా బలవంతం చేస్తూ నా చేత ఆ పనులన్నీ చేయించారు.
సినిమాని ఎక్కువ ప్రమోట్ చెయ్యాలని, ఎక్కువ డైలాగ్స్ చెప్పాలని చెప్తారు.కానీ ఏం చేస్తాం చెయ్యక తప్పదు అని వరుణ్ ఈ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు.
వైరల్ వీడియో: కొడుకు బౌలింగ్ లో బౌండరీ వెలుపల క్యాచ్ పట్టిన తండ్రి