వయసు పెరిగిన బన్నీలో మార్పు రాలేదు.. వరుణ్ తేజ్ సంచలన వ్యాఖ్యలు!
TeluguStop.com
మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) తాజాగా మట్కా సినిమా( Matka Movie ) ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇక మట్కా సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా వరుణ్ తేజ్ ఇదివరకు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన సినిమా గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి తన ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో విషయాలను వెల్లడించారు.
ముఖ్యంగా అల్లు అర్జున్( Allu Arjun ) గురించి వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"""/" /
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా వరుణ్ తేజ్ తన ఫ్యామిలీ గురించి మాట్లాడారు.
నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే తన అన్నయ్య పెదనాన్న బాబాయ్ తన తండ్రి కారణమని తెలిపారు.
ఇక సక్సెస్ వచ్చిన తర్వాత సపోర్ట్ చేసిన వారిని ఎప్పుడు మర్చిపోకూడదు అలా మర్చిపోతే ఆ సక్సెస్ దేనికి పనికిరాదు అంటూ వరుణ్ తేజ్ మాట్లాడారు.
అయితే ఈయన తన గురించి చెప్పినప్పటికీ కొందరు మాత్రం అల్లు అర్జున్ ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అంటూ కామెంట్లు చేశారు.
"""/" /
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అల్లు అర్జున్ ప్రస్తావనకు వచ్చింది.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో చిన్నప్పటి జ్ఞాపకాలను వరుణ్ తేజ్ గుర్తు చేసుకున్నారు.
చిన్నప్పుడు నేను కాస్త లావుగా ఉండడంతో బుగ్గలు బాగా ఉండేవి.అలా చిన్నప్పటినుంచి బన్నీ నన్ను చూస్తే ముందు నా బుగ్గలు గిల్లి లాగేవాడు.
ఇంత వయసు వచ్చిన ఇప్పటికీ ఆ అలవాటు అసలు మానుకోలేదని ఇప్పుడు కూడా మేము కలిసిన ముందు నా బుగ్గలు గిల్లుతాడని వరుణ్ తేజ్ తెలిపారు.
ఇటీవల చెల్లి పెళ్లిలో కూడా బన్నీ అలానే చేస్తూ అల్లరి చేశాడని చిన్నప్పటి జ్ఞాపకాలను వరుణ్ తేజ్ గుర్తు చేసుకున్నారు.
పెళ్లికి ముందే శోభితకు నాగచైతన్య అలాంటి కండిషన్ పెట్టాడా… వామ్మో?