Varun Tej : ఆ సినిమా కోసం పెళ్లిని కూడా వాయిదా వేసుకున్న వరుణ్ తేజ్.. గ్రేట్ అంటూ?

వరుణ్ తేజ్ ( Varun Tej ) త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్( Operation Valentine ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

మార్చి 1 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన పెళ్లి గురించి చేసినటువంటి కామెంట్స్ అవుతున్నాయి.

వరుణ్ లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati )గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ గత ఏడాది నవంబర్ ఒకటో తేదీ పెద్దల సమక్షంలో ఇటలీలో వివాహం (Wedding)చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

"""/"/ ఇక వీరి ప్రేమ విషయం తెలిసినటువంటి కుటుంబ సభ్యులు జూన్ నెలలో నిశ్చితార్థం జరిపించారు.

అయితే వీరి నిశ్చితార్థం తర్వాత వరుణ్ తేజ్ రెండుసార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు అంటూ తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జూన్ లో నిశ్చితార్థం( Varun Tej Engagement ) జరుపుకున్నటువంటి తమకు పెద్దలు రెండుసార్లు పెళ్లి ముహూర్తాలు నిర్ణయించారు.

కానీ తాను సినిమా కోసం వాయిదా వేసుకున్నానని తెలిపారు.ఆపరేషన్ వాలెంటైన్ సినిమా షూటింగ్( Operation Valentine Movie Shooting ) సమయంలో పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించారు.

"""/"/ షూటింగ్ మధ్యలో పెళ్లి చేసుకుంటే తనకు మొత్తం డిస్టబెన్స్ గా అవుతుందని తిరిగి నేను నా పాత్రలోకి వెళ్లడానికి ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతోనే సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు పెళ్లి చేసుకోకూడదని రెండుసార్లు వాయిదా వేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా వరుణ్ తెలియజేయడంతో ఈయనకు సినిమాల పట్ల ఉన్నటువంటి డెడికేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కేసిఆర్ హరీష్ పై రేవంత్ పంచ్ లు..   మాములుగా లేవు