వరుణ్ తేజ్ లాంటి భర్త దొరకడం లావణ్య అదృష్టమే.. భార్యపై ప్రేమతో ఏకంగా అలా చేస్తారా?

టాలీవుడ్ మెగా జోడి లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్( Lavanya Tripathi, Varun Tej ) ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఇటీవల ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయిన విషయం తెలిసిందే.ఎప్పటినుంచో ప్రేమలో మునిగి తేలుతున్న లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ లు ఎట్టకేలకు మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.

ఇకపోతే పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ సినిమాలలో నటిస్తుండగా లావణ్య ఇంటిపట్టునే ఉంటున్న విషయం తెలిసిందే.

ఇకపోతే కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా హీరోలు కూడా పెళ్ళాం ముందు జీరోలె అన్న విషయం తెలిసిందే.

ఇదే విషయం ఇప్పుడు వరుణ్ తేజ్ విషయంలో కూడా ప్రూవ్ అయ్యింది. """/" / అప్పుడే వరుణ్ తేజ్ ని లావణ్య పూర్తిగా కంట్రోల్ లో పెట్టిందట.

ఈ విషయాన్ని స్వయంగా లావణ్య చెప్పిన మాటలు ధ్రువీకరిస్తున్నాయి.టాలీవుడ్ లవ్లీ కపుల్ ( Tollywood Lovely Couple )గా ఉన్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.

ఇటీవల లావణ్య త్రిపాఠి మిస్ పర్ఫెక్ట్ టైటిల్ తో( Miss Perfect ) ఓ వెబ్ సిరీస్ చేసింది.

ఈ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న లావణ్య భర్త వరుణ్ ని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

మీరు లైఫ్ లో పర్ఫెక్ట్ కదా అని యాంకర్ అడగ్గా.కొన్ని విషయాల్లో మాత్రమే నేను పర్ఫెక్ట్.

అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకోను.సినిమా, యాక్టింగ్, డైలాగ్స్ వంటి విషయాల్లో నేను పర్ఫెక్ట్ గా ఉంటాను.

బాగా నటించాలి అనుకుంటాను అని లావణ్య తెలిపింది. """/" / మరి ఇంట్లో మీ ఇద్దరిలో ఎవరు పర్ఫెక్ట్? అని యాంకర్ మరొక ప్రశ్న అడిగగా.

వరుణ్ కి శుభ్రంగా ఉండటం చాలా ఇష్టం.ఖాళీ సమయం దొరికితే క్లీన్ చేయడం, సర్దటం చేస్తూ ఉంటాడు.

తన మూడ్ బాగోకపోయినా క్లీన్ చేస్తాడు.అంతెందుకు మేము విదేశాలకు టూర్ కి వెళితే అక్కడ నా సామానులు కూడా ఆయనే సర్దేస్తాడు.

అని గట్టిగా నవ్వేసింది.లావణ్య కామెంట్స్ విన్న సోషల్ మీడియా జనాలు వరుణ్ ని ఒక రేంజ్ లో కంట్రోల్ లో పెట్టింది లావణ్య.

పాపం ఎన్ని కష్టాలు వచ్చాయి అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

వైశాలికి షేక్‌హ్యాండ్ ఇవ్వని ఉజ్బెక్ చెస్ ప్లేయర్.. ఇస్లాం కారణమంటూ కొత్త ట్విస్ట్..?