హర్రర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిన వరుణ్ తేజ్

హర్రర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిన వరుణ్ తేజ్

మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్( Varun Tej ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హర్రర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిన వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాకు తన వంతు చాలా కష్టపడడంతో పాటు సినిమాలోని పాత్ర కోసం ఎంతటి సాహసానికైనా వెనకంచిన వేయడు.

హర్రర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అయిన వరుణ్ తేజ్

కానీ, వరుణ్ తేజ్ విషయంలో ఎందుకో ఏమో కానీ ఎంత కష్టపడినా కొత్త కథలతో వచ్చినా కానీ చివరికి నిరాశే ఎదురవుతుంది.

వరుణ్ తేజ్ నటించిన గత మూడు సినిమాలు అయిన గాండీవధర అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా పరాజయం అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

అంతేకాకుండా దానికంటే ముందు ఎఫ్ 3 సినిమా హిట్ సొంతం చేసుకున్నా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది.

"""/" / అయితే తాజాగా సరికొత్త సినిమాని వరుణ్ తేజ్ ఓకే చేసినట్లు తెలుస్తుంది.

నేడు వరుణ్ తేజ్ 34 పుట్టిన రోజు సందర్భంగా యూవీ క్రియేషన్స్( UV Creations ) బ్యానర్ పై మేర్లపాక గాంధీ( Merlapaka Gandhi ) దర్శకత్వంలో వరుణ్ తేజ్ 15 సినిమాను అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్లో ఒక చిన్న కుండ ఉంది.కొండపై డ్రాగన్ బొమ్మ ఉండడంతో పాటు చుట్టూ కొరియన్ భాషలో అక్షరాలు ఉన్నాయి.

అంతేకాకుండా ఈ పోస్టర్ ను యూవి క్రియేషన్స్ రిలీజ్ చేస్తూ ఇండో కొరియన్ హారర్ కామెడీ కథ అని తెలిపింది.

"""/" / దీంతో వరుణ్ తేజ్ సరికొత్తగా హారర్ కామెడీ కథతో( Horror Comedy Story ) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు, అలాగే ఇండియా కొరియా దేశాలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నట్లు సమాచారం.ఇక మరొకవైపు డైరెక్టర్ గాంధీ చేసిన సినిమాలు కృష్ణార్జున యుద్ధం, మ్యాస్ట్రో, లైక్ షేర్ సబ్ స్క్రైబ్ లాంటి సినిమాలు అన్నీ కూడా యావేరేజ్ సినిమాలుగానే నిలిచాయి.

మరి హిట్టు కోసం ఎదురు చూస్తున్నా డైరెక్టర్ హీరో కలిసి చేయబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

నెల్సన్ డైరెక్షన్ లో ఎన్టీయార్ నటించడానికి సిద్ధం గా ఉన్నాడా..?