లవ్ యూ బేబీ అంటూ లావణ్యపై ప్రేమను చాటుకున్న వరుణ్.. ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) మెగా హీరో వరుణ్ తేజ్ లు( Varun Tej ) ఇద్దరూ ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయి ఏడాది పూర్తి అయ్యింది.

గత ఏడాది ఇదే రోజున లావణ్య వరుణ్ తేజ్ ల వివాహం ఇటలీలో గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే.

పెళ్లికి తక్కువ మంది హాజరైనప్పటికీ హైదరాబాదులో నిర్వహించిన వెడ్డింగ్ రిసెప్షన్ కు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు.

"""/" / ఇక పెళ్లి తర్వాత మెగా కోడలు లావణ్య త్రిపాఠి అత్తమామలతో కలిసి చాలా పండుగలు సెలబ్రేట్ చేసుకుంది.

తాజాగా అత్త మామలు, ఆడపడుచు తో కలిసి దీపావళి పండుగను( Deepavali Festival ) సెలబ్రేట్ చేసుకుంది.

అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది లావణ్య.మరోవైపు వరుణ్ తేజ్ కూడా లావణ్య త్రిపాఠి తో కలిసి వెకేషన్ లో తీసుకున్న బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ పెళ్లిరోజు శుభాకాంక్షలు లవ్ యూ బేబీ అని రాసుకొచ్చాడు.

"""/" / ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు మెగా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుటున్నారు.

ఎప్పటికి ఇలాగే ఉండాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం అందుకు సంబందించిన పోస్ట్ లు వైరల్ గా మారాయి.

ఇకపోతే వరుణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

మరోవైపు లావణ్య ఇంటి బాధ్యతలను చూసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు.అయితే సినిమాలలో మంచి మంచి క్యారెక్టర్లు వస్తే నటించడానికి తన సిద్ధంగా ఉన్నట్లు లావణ్య గతంలో పెళ్లి తర్వాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఇద్దరి చేతిలో దెబ్బలు తిన్న నాగార్జున.. పనులు చేయకపోతే అలా బిహేవ్ చేసేవారా?