వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ కార్డు ధరతో ఒక ఐ-ఫోన్ కొనేయొచ్చా..!

చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం అవుతున్న వరుణ్ తేజ్( Varun Tej ) మరియు లావణ్య త్రిపాఠి ప్రేమ వ్యవహారం ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చింది.

రేపు వీళ్లిద్దరి నిశ్చితార్ధ వేడుక మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది సినీ ప్రముఖుల మధ్య అట్టహాసం గా జరగనుంది.

పెళ్లి కి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనుంది.వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుంది అని సోషల్ మీడియా లో ఒక వార్త రాగానే సెన్సేషన్ అయ్యింది.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ లావణ్య త్రిపాఠి గతం లో పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది.

ఆమె సోషల్ మీడియా లో వచ్చే కథనాలను ముందుగా గమనించే ఇలాంటి కామెంట్స్ చేసిందని ఈరోజు అర్థం అయ్యింది.

మెగా ఫ్యామిలీ కి సంబంధించిన ప్రతీ ప్రైవేట్ ఫంక్షన్ లో లావణ్య త్రిపాఠి ఉండడాన్ని చూసి , వీళ్లిద్దరి మధ్య ఏమి లేదంటే ఎవరు మాత్రం నమ్ముతారు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేసేవాళ్ళు.

"""/" / వాళ్ళు కామెంట్ చేసిన వ్యాఖ్యలే నిజం అయ్యాయి.ఇక వరుణ్ తేజ్ పెళ్లి గురించి కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ అని తెలుస్తుంది.

గతం లో వరుణ్ తేజ్ చెల్లి నిహారిక కొణిదెల( Niharika Konidela )పెళ్లి కూడా ఇలాగే జరిగింది.

రాజస్థాన్ లోని ఉదయగడ్ ప్యాలస్ లో అంగరంగ వైభవం గా జరిగింది.ఇప్పుడు వరుణ్ - లావణ్య పెళ్లి కూడా అక్కడే జరగబోతుందని సమాచారం.

రీసెంట్ గా శర్వానంద్ పెళ్లి కూడా అక్కడే జరిగింది.ఇకపోతే ఈ పెళ్ళికి ఏర్పాట్లు ఇప్పటి నుండే ప్రారంభం అయ్యాయి, కేవలం వెడ్డింగ్ కార్డు కోసమే 80 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నారట, బంగారు పూతతో ఈ వెడ్డింగ్ ని కోటింగ్ చెయ్యబడుతుందని తెలుస్తుంది.

80 వేల రూపాయలకు పైగా ఖర్చు చేస్తే ఐ ఫోన్ కి సంబంధించి ఎదో ఒక మోడల్ వచ్చేస్తుంది, అంత డబ్బు కేవలం వెడ్డింగ్ కార్డు కోసం ఖర్చు చేస్తున్నారంటే ఈ వివాహ మహోత్సవం ఎంత గ్రాండ్ గా జరగబోతుందో అర్థం చేసుకోవచ్చు.

"""/" / నిర్మాతగా నాగబాబు( Naga Babu ) కోట్ల రూపాయిలు నష్టపోయి, అప్పులు కట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిన రోజు నుండి, ఇప్పటి వరకు ఆయన ఎదిగిన తీరు ప్రశంసనీయం.

కొడుకు హీరో గా స్థిరపడిపోయిన తర్వాత నాగబాబు ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు, కూతురు పెళ్లి చిరకాలం గుర్తుండిపోయేలా చేసాడు, ఇప్పుడు కొడుకు పెళ్లి కూడా అదే విధంగా జరిపించబోతున్నాడు.

వరుణ్ తేజ్ ఇప్పుడు ఒక్కో సినిమాకి 6 నుండి 10 కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

మరో పక్క లావణ్య త్రిపాఠి కూడా ఒక్కో సినిమాకి కోటి నుండి రెండు కోట్ల రూపాయిల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ఈమె పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుందట, ఆ కండిషన్ మీదనే ఆమె పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది.

వీళ్లిద్దరి వివాహ మహోత్సవం ఎంత గ్రాండ్ గా జరగబోతుందో చూసేందుకు అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా టైటిల్స్ అర్థాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..?