డేట్ కి వెళ్లిన మెగా కపుల్స్… వైరల్ అవుతున్న ఫోటోలు?
TeluguStop.com
మెగా కాంపౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఈయన ఎన్నో విభిన్న సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా తన పని తాను చూసుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా ఎంతో సైలెంట్ గా ఉండే వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) తో రహస్యంగా ప్రేమ ప్రయాణం చేస్తూ వచ్చారు.
అయితే ఈ విషయాన్ని తమ పెద్దలకు చెప్పడంతో వారి అంగీకారంతోనే పెళ్లికి సిద్ధమయ్యారు.
"""/" /
జూన్ 9వ తేదీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ (Engagment) వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.అయితే నిశ్చితార్థం తర్వాత వీరిద్దరూ పలు వెకేషన్ లకు వెళుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.
ఇటీవలే వీరిద్దరూ ఇటలీ వెకేషన్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరోసారి ఈ కపుల్స్ కాఫీ డేట్ (Coffee Date)కి వెళ్లారని తెలుస్తోంది.
"""/" /
ఈ విధంగా వీరిద్దరూ పెళ్ళికి ముందే చిల్ అవుతూ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇందులో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా లావణ్య త్రిపాఠి ఫోటోని షేర్ చేయగా లావణ్య త్రిపాఠి తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా వరుణ్ తేజ్ ఫోటోలను షేర్ చేశారు.
ఇలా ఈ ఫోటోలు వైరల్ కావడంతో మెగా ఫాన్స్ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ హీరో బన్నీ బెయిల్ రద్దవుతుందా.. ఆ సాక్ష్యాల వల్ల బన్నీకి ఇబ్బందేనా?