ఈ ఫొటోలో కనిపిస్తున్న బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా?

మెగా హీరో నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ గురించి అందరికీ తెలిసిందే.

వరుణ్ తేజ్ నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరుచుకున్నాడు.

మొదటి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏం సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 , గద్దల కొండ గణేష్‌ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక వరుణ్ తేజ్ నటించిన సినిమాలు కూడా సూపర్‌ హిట్‌గా నిలిచాయి.నేడు వరుణ్ తేజ్ బర్త్ డే.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె మూవీలో వరుణ్‌ నటనకు గాను పలువురు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు.

ఈ సినీమా 2015లో విడుదలైన విషయం తెలిసిందే.ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రల్లోకనిపించనున్నారు.ఇక ఇందులో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే ఇందులో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా, జార్జి సి విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.అంతే కాకుండా ఈ సినిమాలో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ఈ సినిమాను 2022 మార్చి 18న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

"""/" / ఇప్పటికే ఈ సినిమా విడుదలైన టీజర్ లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వరుణ్ తేజ్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అందులో వరుణ్ తేజ్ చూడటానికి ముద్దు ముద్దు గా కనిపిస్తున్నాడు.ఇక ఈ ఫోటోను చూసిన మెగా అభిమానులు ఫోటోని వైరల్ చేస్తున్నారు.

ఆ స్టార్ హీరోకు భారీ షాకిచ్చిన త్రిష.. చిరంజీవి, కమల్ కోసం ఇంత చేసిందా?