అల్లు అర్జున్ చరణ్ పెళ్లిళ్ల గురించి వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్?
TeluguStop.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) ఆగస్టు 25వ తేదీ గాండీవ దారి అర్జున(( Ghandeevadari Arjuna )అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రీ రిలీజ్ వేడుకను కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించినటువంటి సుమ( Suma ) తన ప్రశ్నలతో వరుణ్ తేజ్ ను ఉక్కిరి బిక్కిరి చేశారు.
త్వరలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే.
ఇప్పటికే వీరిద్దరిని నిశ్చితార్థం కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. """/" /
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ ను సుమ ప్రశ్నిస్తూ.
పెళ్లిళ్లు అయిన తర్వాత అల్లు అర్జున్ రామ్ చరణ్ వీరిద్దరిలో ఎవరిలో మార్పులు ఎక్కువగా వచ్చాయి అంటూ సుమ ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఈ ప్రశ్న వారిద్దరిని అడగాలి అంటూ సమాధానం చెప్పిన అనంతరం పెళ్లయిన తర్వాత ప్రతి ఒక్కరూ మారాల్సిందేనని ఈయన తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడిని ఉద్దేశిస్తూ ఈయన మాకు ఎఫ్2 సినిమా ద్వారా అదే నేర్పించారని, పెళ్లయిన తర్వాత మారిపోవడం మంచిదేనని వరుణ్ తేజ్ తెలిపారు.
"""/" /
ఇలా ఈ ప్రశ్నకు వరుణ్ తేజ్ సమాధానం చెప్పడంతో పరోక్షంగా పెళ్లి తర్వాత అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరిలో కూడా మార్పులు వచ్చాయని చెప్పకనే చెప్పేశారు.
ఇలా పెళ్లిళ్ల గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల వివాహం నవంబర్ లేదా డిసెంబర్ నెలలో జరగబోతుందని వీరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతుందని వరుణ్ తేజ్ పలు ఇంటర్వ్యూలలో తెలియజేశారు.
పుట్టబోయే పిల్లల గురించి అలాంటి కామెంట్స్ చేస్తున్నారు.. ప్రియమణి కామెంట్స్ వైరల్!