ప్రవీణ్ సత్తార్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ పెంచిన వరుణ్ తేజ్..?

మెగా కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుణ్ తేజ్ గని, ఎఫ్ 3 సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన గని చిత్రం ఏప్రిల్ 8 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలైన తరువాత అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక ఈ రెండు సినిమాలు పూర్తి చేసుకున్న అనంతరం వరుణ్ తేజ్ తన 12 వ సినిమాని ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేయనున్నారు.

ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ నాగార్జున ది ఘోస్ట్ చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా అనంతరం వరుణ్ తేజ్ సినిమాతో బిజీ కానున్నారు.

ఈ సినిమా జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ భారీ మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

"""/"/ ప్రవీణ్ సత్తార్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాని 40 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గతంలో ఒక్కో సినిమాకి ఎనిమిది నుంచి పది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే వరుణ్ తేజ్ ఈ సినిమాకి 12 కోట్లు డిమాండ్ చేశారని తెలుస్తోంది.

ఇక వరుణ్ కెరీర్లోనే ఇది హైయెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పాలి.

మహేష్ రాజమౌళి మూవీ టికెట్ రేటు 5000.. ఫ్యాన్స్ ఈ రేట్లకు సిద్ధం కావాల్సిందేనా?