మాస్ ఇమేజ్ పై వరుణ్ తేజ్ కన్ను..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇన్నాళ్లు లవ్ స్టోరీస్ చేస్తూ వచ్చాడు.ఇక ఇప్పుడు తన ఫోకస్ అంతా మాస్ ఇమేజ్ పై పెట్టాడని టాక్.

కెరియర్ లో గద్దలకొండ గణేష్ అనే మాస్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తనని మెగా ఫ్యాన్స్ మాస్ హీరోగా యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇక మీదట అలాంటి సినిమాలే చేయాలని చూస్తున్నాడట.

ప్రస్తుతం చేస్తున్న గని సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలో మాస్ మూవీగా వస్తుంది.

ఈ క్రమంలో వరుణ్ తేజ్ మాస్ మసాలా సినిమాలే చేసేలా ప్లాన్ చేస్తున్నాడు.

"""/"/ గనితో పాటుగా అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్.

అయితే ఎఫ్3 తర్వాత మాత్రం వరుస మాస్ సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాస్ మసాల సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.

అంతేకాదు ఇక మీదట యువ దర్శకులతో కాకుండా స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేయాలని చూస్తున్నాడట.

వరుణ్ తేజ్ ప్లాన్ బాగానే ఉంది కాని కేవలం స్టార్ డైరక్టర్స్ తోనే అంటే మాత్రం అది కుదిరే పని కాదని చెప్పొచ్చు.

గని, ఎఫ్3 ఈ రెండు సినిమాలు హిట్లు పడితే వరుణ్ తేజ్ క్రేజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

ఆ తప్పు కారణంగానే వైఎస్ జగన్ పట్ల వ్యతిరేకత వచ్చింది: అశ్వినీ దత్