నిర్మాతల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న మెగా ప్రిన్స్… మంచి నిర్ణయం అంటూ కామెంట్స్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ఒకరు.

ఇలా మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఈ మధ్యకాలంలో వరుణ్ తేజ్ నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.

ఈ క్రమంలోనే ఈయన నటించిన తాజా చిత్రం గాండీవ దారి అర్జున(Ghandeevadari Arjuna),అలాగే గని (Ghani)సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అవడంతో వరుణ్ తేజ్ అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఈ విధంగా ఎన్నో అంచనాల నడుమ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నాయి.

ఈ విధంగా ఈ సినిమాల వల్ల నిర్మాతలు కూడా భారీ స్థాయిలో నష్టపోయారని చెప్పాలి.

ఇక తనతో సినిమాలు చేసి భారీ నష్టాలను ఎదుర్కొన్నటువంటి నిర్మాతల పట్ల వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సినిమా చేసే అప్పుల పాలైనటువంటి నిర్మాతలను ఆదుకోవడానికి ఈయన తీసుకున్నటువంటి నిర్ణయం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

"""/" / వరుణ్ తేజ్ నటించిన గని అలాగే గాండీవ దారి అర్జున నిర్మాతల కోసం ఈయన మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాల ద్వారా నిర్మాతలకు నష్టాలను మిగిల్చినటువంటి వరుణ్ తేజ్ వీరి కోసం వీరి బ్యానర్ లోనే మరొక సినిమా చేసి మంచి లాభాలను అందించాలని ఈ నష్టాలను పూడ్చివేయాలని నిర్ణయం తీసుకున్నారట.

ఈ విధంగా నిర్మాతల గురించి ఆలోచిస్తూ వరుణ్ తేజ్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంతో సరైనదే అంటూ వరుణ్ తేజ్ నిర్ణయం పై అభిమానులు నేటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న ఎగిరే కారు.. ఇండియన్ రోడ్ల కోసమే తయారు చేశారట..?