అలాంటి విషయాలు బయటకు చెప్పను.. లావణ్యతో ప్రేమపై వరుణ్ రియాక్షన్ ఇదే!
TeluguStop.com
ప్రిన్స్ , నరేశ్ అగస్త్య ( Prince, Naresh Agastya )ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం కలి( Kali ).
శివశేషు దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.ఈ నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్.
ఈ వేడుకకు హీరోలు వరుణ్ తేజ్, అల్లరి నరేశ్, ప్రియదర్శి, ఆకాశ్ పూరి హాజరై సందడి చేశారు.
ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఈ హీరోలు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
ఈ సినిమా కోసం రెండేళ్ల నుంచి కష్టపడ్డాము. """/" /
విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటాయి.
ఓటీటీలో విడుదల చేద్దాం అనుకున్నాము.కానీ, మ్యూజిక్ విన్న తర్వాత థియేటర్ లోనే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యము.
సూసైడ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది.ఈ నేపథ్యాన్నే ఎందుకు ఎంచుకున్నానంటే నాకు ఉదయ్‌కిరణ్ అంటే ఇష్టం.
ఆయన సూసైడ్ చేసుకున్నప్పుడు నేను షాక్ అయ్యాను.మాములు మనిషిని కావడానికి చాలా సమయం పట్టింది.
ఆ తర్వాత నా స్నేహితుడు ఒకరు అలానే మరణించాడు.ఇలాంటి ఘటనలు చూసి ఈనేపథ్యంలో సినిమా చేయాలనుకున్నా అని ప్రిన్స్ చెప్పుకొచ్చారు.
"""/" /
మ్యారీడ్ లైఫ్ బాగుందా.బ్యాచిలర్ లైఫ్ బాగుందా? అని అడగగా వరుణ్ తేజ్ స్పందిస్తూ.
అప్పుడు అది బాగుంది.ఇప్పుడు ఇది బాగుంది అని తెలిపారు.
మీ ఇంట్లో ఎవరి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది? మీదా, లావణ్యదా? అని ప్రశ్నించగా.
ఒకరి డామినేషన్ అంటూ ఉండదు.ఇద్దరం అభిప్రాయాలు పంచుకుంటుంటాం.
మా నాన్న డామినేషన్ ఎక్కువగా ఉంటుంది అని నవ్వుతూ తెలిపారు.మిస్టర్ సినిమా ( Mister Movie )సమయంలో మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందా అని ప్రశ్నించగా అలాంటి విషయాలు బయటకు చెప్పను అది ఇప్పుడు అవసరం లేదు అని తెలిపారు వరుణ్ తేజ్.
మీ ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు? అని ప్రశ్నించగా.కాస్త అసహనం వ్యక్తం చేసిన వరుణ్ తేజ్ ఇది కలి ఈవెంట్ నా లేక నా ఇంటర్వ్యూ నా అని అంటూనే నేనే ప్రపోజ్ చేశాను అని తెలిపారు.
ప్రశాంత్ నీల్ ఆ సినిమా చేస్తే చూడాలని ఉంది అంటున్న నెటిజన్లు…ఇంతకీ ఈ సినిమా..