Varun Tej Pawan Kalyan : పవన్ సినిమాలో అలా చేస్తే ఫ్యాన్స్ అస్సలు ఒప్పుకోరు.. వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్!

మెగా హీరో వరుణ్ తేజ్( Varun Tej ) మరికొన్ని రోజుల్లో ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

మార్చి నెల 1వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.ఈరోజు విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుణ్ తేజ్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

సాయుధ బలగాలపై సినిమాలు తక్కువగా వస్తున్నాయనే ఆలోచనతోనే ఆపరేషన్ వాలంటైన్ తెరకెక్కించామని వరుణ్ తేజ్ తెలిపారు.

దేశభక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుందని కానీ అలాంటి సినిమాలు ఎక్కువగా రాకపోవడానికి కారణమేంటో నాకు తెలియదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

నా బెస్ట్ సినిమాలలో కంచె ( Kanche ) ఒకటని దేశభక్తి నిండిన అలాంటి సినిమాలో నటించడం నా లక్ అని వరుణ్ తేజ్ వెల్లడించారు.

మళ్లీ ఆ తరహా సినిమా అవకాశాలు రావట్లేదే అనుకునే సమయంలో ఆపరేషన్ వాలంటైన్ వచ్చిందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

"""/" / కంచె మూవీకి మించిన ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయని ఆయన కామెంట్లు చేశారు.

ధృవ సీక్వెల్ లో( Dhruva Sequel ) నేనెందుకు చేస్తానని చరణ్ అన్నయ్యే చేయొచ్చని వరుణ్ తేజ్ తెలిపారు.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలో విలన్ గా చేయనని అలా చేస్తే ఫ్యాన్స్ చంపేస్తారని వరుణ్ తేజ్ సరదాగా చెప్పుకొచ్చారు.

జనసేన పార్టీకి( Janasena Party ) సపోర్ట్ చేస్తానని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.

"""/" / పూల్వామా దాడి ఇతివృత్తాన్ని చూపించబోతున్నా సెక్యూరిటీ కారణాల వల్ల అలాంటి ఘటనలకు సంబంధించిన పేర్లు పెట్టకూడదని అందుకే ఆపరేషన్ వాలంటైన్ ఎంపిక చేశామని వరుణ్ తేజ్ అన్నారు.

నేను ఫైటర్ సినిమా చూశానని ఆ సినిమాకు ఈ సినిమాకు ఎలాంటి కనెక్షన్ ఉండదని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.

వరుణ్ తేజ్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?