‘ఆపరేషన్ వాలెంటైన్’గా రానున్న వరుణ్.. టైటిల్ పోస్టర్ అదిరింది..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) గురించి అందరికి తెలుసు.

ఈయన మెగా ఫ్యామిలీ నుండి వచ్చినప్పటికీ తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను సంపాదించు కున్నాడు.

ముందు నుండి వరుణ్ తేజ్ డిఫరెంట్ సినిమాలను ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు.

ఈయన సినిమా వస్తుంది అంటే ఏదొక కొత్తదనం ఉంటుంది అని ఫ్యాన్స్ సైతం నమ్మేలా చేసారు.

ప్రెజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.మరి ఆ సినిమాల్లో వరుణ్ తేజ్ 13వ సినిమా ఒకటి.

ఈ సినిమా కూడా భిన్నంగా ఉండనుంది.నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా ఈ సినిమాను నూతన డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్( Shakti Pratap Singh ) తెరకెక్కిస్తున్నాడు.

భారత వాయుదళ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. """/" / ఈ సినిమా కొద్దీ రోజుల క్రితమే ప్రకటించగా త్వరలోనే షూట్ స్టార్ట్ కానుంది.

మరి ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసారు.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ''ఆపరేషన్ వాలెంటైన్''(Operation Valentine) అనే టైటిల్ ను అనౌన్స్ చేస్తూ ఆసక్తికర పోస్టర్ రిలీజ్ చేసారు.

అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. """/" / ఈ ఏడాది డిసెంబర్ 8న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా వెల్లడించింది.

ఈ సినిమాలో వరుణ్ IAF అధికారిక నటిస్తుండగా వరుణ్ తేజ్ కు జంటగా మిస్ యూనివర్స్ ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మానుషీ చిల్లర్( Manushi Chhillar ) హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక పాన్ ఇండియన్ వ్యాప్తంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ అండ్ రెనైస్సేన్స్ పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రాజకీయాలలో నాకు ఎలాంటి ఆశలు లేవు.. నా జీవితం వాళ్లకే అంకితం: నాగబాబు