వరుణ్, లావణ్య పెళ్లికి టాలీవుడ్ నుంచి హాజరయ్యేది ఎవరు?
TeluguStop.com
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్( Varun Tej ) మరియు లావణ్య త్రిపాఠిల( Lavanya Tripathi ) వివాహం మరికొన్ని గంటల్లో ఇటలీ లో జరుగబోతున్న విషయం తెల్సిందే.
పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను ప్రముఖ ఈవెంట్ సంస్థ చూసుకుంటోంది.ఇప్పటికే అక్కడికి మెగా ఫ్యామిలీ వెళ్లిపోయారు.
చిరంజీవి దంపతులతో పాటు పవన్ కళ్యాణ్ దంపతులు కూడా వెళ్లిన విషయం తెల్సిందే.
మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి దాదాపు అందరూ కూడా ఈ వివాహానికి హాజరు అవ్వబోతున్నారు.
అయితే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఇతరులు ఎవరు ఈ పెళ్లికి హాజరు అవుతారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారికి కొందరికి కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఆహ్వానం దక్కిందనే వార్తలు వస్తున్నాయి.
"""/" /
అయితే మెగా ఫ్యామిలీ ఆహ్వానం మేరకు ఇద్దరు దర్శకులు మరియు ఒక యంగ్ హీరో మాత్రమే ఇప్పటి వరకు ఇటలీ చేరుకున్నారు.
మిగిలిన వారు పెళ్లికి హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు.అయితే అయిదు రోజుల తర్వాత జరిగే హైదరాబాద్ రిసెప్షన్ కి అందరూ హాజరు అవ్వాలి అనుకుంటున్నారు.
పెళ్లి కోసం ఇటలీ(
Italy ) వరకు వెళ్లాలి అని చాలా మంది అనుకున్నా కూడా ఏవో కారణాల వల్ల అది సాధ్యం కావడం లేదు అంటూ సమాచారం అందుతోంది.
"""/" /
ప్రస్తుతం పెళ్లి కి సంబంధించిన హడావుడి మొదలు అయింది.ఇప్పటికే వెళ్లాల్సిన వెళ్లారు.
ఇక మీదట వెళ్తారా లేదా అనేది తెలియదు.ఇండస్ట్రీ నుంచి చాలా మంది పెళ్లికి హాజరు అవుతారు అని అంతా అనుకున్నా కూడా అది నిజం అవ్వడం లేదు అంటూ సమాచారం అందుతోంది.
వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ల యొక్క ప్రేమ సుదీర్ఘ కాలం గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.
వీరిద్దరు కలిసి రెండు సినిమా ల్లో నటించారు.ఆ సమయం లో ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
ఒకే ఏడాదిలో ఏకంగా రెండు సినిమాలు.. స్టార్ హీరో బాలకృష్ణకు మాత్రమే సాధ్యమా?