ఆ హీరోలతో నన్ను పోల్చవద్దు.. వరుణ్ సందేశ్ కీలక వ్యాఖ్యలు?

హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం సినిమాలతో నటుడిగా వరుణ్ సందేశ్ మంచి పేరును సొంతం చేసుకున్నారు.

అయితే ఈ సినిమాల తరువాత వరుణ్ సందేశ్ పదుల సంఖ్యలో సినిమాల్లో నటించినా ఆ సినిమాలు సక్సెస్ కాలేదు.

బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొనడం ద్వారా వరుణ్ సందేశ్ పాపులారిటీని మరింత పెంచుకున్నారు.

ప్రస్తుతం ఇందువదన సినిమాలో వరుణ్ సందేశ్ నటిస్తుండగా ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

తరుణ్, ఉదయ్ కిరణ్ కెరీర్ తొలినాళ్లలో సక్సెస్ లు సాధించి ఆ తరువాత వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

ఉదయ్ కిరణ్, తరుణ్ లతో పోల్చడం గురించి వరుణ్ స్పందిస్తూ తనకు ఉదయ్ కిరణ్ బాగా తెలుసని ఉదయ్ కిరణ్ పర్సనల్ లైఫ్ లో ఏం జరిగిందో అని చాలా బాధ పడ్డానని వరుణ్ సందేశ్ వెల్లడించారు.

తన చేతుల నుంచి దేనిని కోల్పోయానో దానిని తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని వాళ్లతో తనను పోల్చవద్దని వరుణ్ సందేశ్ పరోక్షంగా చెప్పారు.

"""/"/ బిగ్ బాస్ షో తర్వాత కొన్ని కథలకు తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అయితే కరోనా, ఇతర రీజన్స్ వల్ల కొన్ని సినిమాలు సెట్స్ పైకి వెళ్లలేదని వరుణ్ పేర్కొన్నారు.

యూఎస్ లో ఒక ఐటీ కోర్సును పూర్తి చేశానని త్వరలో బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నానని వరుణ్ సందేశ్ చెప్పుకొచ్చారు.

ఇప్పటికే విడుదలైన ఇందువదన పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే.

"""/"/ 2015 సంవత్సరంలో ప్రముఖ నటి వితికా షేరును వరుణ్ సందేశ్ వివాహం చేసుకున్నారు.

వరుణ్ సందేశ్ ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి మనవడు అనే సంగతి తెలిసిందే.

మళ్లీ నటుడిగా సక్సెస్ కావాలనే ఉద్దేశంతో వరుణ్ సందేశ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

బెన్ ఫిట్ షోలు వేయకపోవడం వల్ల ఎవ్వరికి ఎక్కువ నష్టం జరగబోతుంది..?