అదేనా ఫస్ట్ రెమ్యూనరేషన్… తొలి పారితోషికం పై వరుణ్ సందేశ్ కామెంట్స్!

హ్యాపీడేస్( Happy Days ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు నటుడు వరుణ్ సందేశ్( Varun Sandesh ) .

కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో వరుణ్ సందేశ్ అనంతరం వరుస అవకాశాలను అందుకున్నారు కానీ అనుకున్న స్థాయిలో సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఈయన ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి వారిని సందేశ్ నటి వితికా( Vithika ) ను వివాహం చేసుకున్నారు.

ఇక వీరి వివాహం తర్వాత ఇండస్ట్రీకి ఇద్దరు దూరంగా ఉన్నారు. """/" / ఇక ఈ జంట అనుకోకుండా బిగ్ బాస్3( Bigg Boss 3 ) కార్యక్రమంలోకి అడుగుపెట్టడం తిరిగి కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీ అవడం జరుగుతుంది.

ప్రస్తుతం వరుణ్ సందేశ్ పలు సినిమాలు ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక నటి వితికా మాత్రం ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు కానీ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

"""/" / తాజాగా ఈయన విరాజి( Viraaji ) అనే సినిమాను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా తాను తీసుకున్న మొదటి రెమ్యూనరేషన్( Remuneration ) గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాను హ్యాపీడేస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోగా పరిచయమయ్యాను.ఈ సినిమా కోసం తాను లక్ష రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నానని తెలిపారు.

అదే తన మొదటి సంపాదన అంటూ ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ సినిమా ద్వారా నిఖిల్ కూడా పరిచయమయ్యారు అయితే నిఖిల్ మాత్రం ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకొని పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలను పొందారు.

సూపర్ స్టార్ మహేష్ కు అలాంటివి నచ్చవా.. జక్కన్న మూవీ కోసం తొలిసారి మారారా?