ఆక్సిజన్ మాస్క్ తో సినిమా షూటింగ్.. సమంత కష్టాలకు కన్నీళ్లు పెట్టిన హీరో?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) తాజాగా సిటాడేల్( Citadel ) వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
తెలుగులో హానీ బన్నీ పేరిట విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది.
నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
ఇక ఈ వెబ్ సిరీస్ కోసం బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్( Varun Dhawan ) సమంత జంటగా నటించారు అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ ధావన్ సమంతకు సంబంధించి ఎన్నో విషయాలను వెల్లడించారు.
"""/" /
సమంత నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు.
ఈ డిప్రెషన్ నుంచి బయటపడిన ఈమె తిరిగి సినిమాలకు కమిట్ అయ్యారు.ఇలాంటి తరుణంలోనే ఆమె మయోసైటిసిస్( Myositis ) వ్యాధికి గురి అయ్యారు.
ఈ వ్యాధి కారణంగా సమంత ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా నటుడు వరుణ్ ధావన్ ఈ సిరీస్ షూటింగ్ సమయంలో సమంత పడిన కష్టాల గురించి తెలియజేశారు.
"""/" /
ఈ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.ఈ సిరీస్ షూటింగ్ సమయంలో సమంత కష్టాలను కళ్లారా చూశాను.
ఆమె పడుతున్న కష్టం చూసి కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదని తెలిపారు.షూటింగ్ సమయంలో ఏమాత్రం గ్యాప్ వచ్చిన సమంత ఆక్సిజన్ మాస్క్ వేసుకొని ఉండేది.
కొన్నిసార్లు షూటింగ్ జరుగుతున్న సమయంలోనే స్పృహ తప్పి కింద పడిపోయేది.అయినా కానీ ఇచ్చిన కమిట్మెంట్ కి కట్టుబడి షూటింగ్ ని పూర్తి చేసింది.
ఇలాంటి అద్భుతమైన మనిషిని నేను నా జీవితంలో చూడలేదు.కేవలం ఆడవాళ్ళకు మాత్రమే కాదు ఈ జనరేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈమె ఎంతో స్ఫూర్తి.
నేను ఈ సిరీస్ లో సమంతను చూసి ఆమెకు అభిమానిగా మారిపోయాను ఆమె నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను అంటూ ఈ సందర్భంగా వరుణ్ ధావన్ సమంత పడిన కష్టాల గురించి తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆ విషయంలో ప్రభాస్ ను ఫాలో అవుతున్న రామ్ చరణ్, తారక్.. ఏం జరిగిందంటే?