ట్విట్టర్ లోనే అవకాశాలు అడుగుతున్న బన్నీ హీరోయిన్… ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎక్కువ కాలం మనగడం ఉండదు అనే విషయం మనకు తెలిసిందే.

అందుకే అవకాశాలు వస్తున్న సమయంలో వాటిని అందుకొని ఇండస్ట్రీలో కొనసాగడం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు అయితే కొంతమంది హీరోయిన్లకు ఇండస్ట్రీలో నటించాలని ఉన్నప్పటికీ అవకాశాలు రాక అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ఈ విధంగా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఏకంగా ట్విట్టర్( Twitter ) ద్వారా తనకు అవకాశాలు ఇవ్వండి అంటూ బన్నీ హీరోయిన్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

అవకాశాలు అడుగుతున్నటువంటి ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే. """/" / ఆమె మరేవరో కాదు అల్లు అర్జున్( Allu Arjun) హీరోగా నటించిన వరుడు సినిమా హీరోయిన్ భాను శ్రీ మెహ్రా( Bhanu Sri Mehra ) వరుడు సినిమా( Varudu Movie ) ద్వారా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే డిజాస్టర్ అందుకున్నారు.

అనంతరం పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు.అయితే ఇండస్ట్రీకి దూరమైంది అనుకున్నటువంటి భాను శ్రీ ఉన్నఫలంగా అల్లు అర్జున్ తనని బ్లాక్ చేశారు అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.

ఇలా అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ అయినటువంటి ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

"""/" / ఇక సినిమాలలో తిరిగి నటించడం కోసం ఎదురుచూస్తున్నటువంటి భాను శ్రీ మెహ్రా ఏకంగా ట్విట్టర్ వేదికగా పలు విషయాలను తెలియజేస్తూ ఈమె తనకు సినిమా అవకాశాలు లేకపోవడంతో ట్రావెలింగ్ చేస్తున్నానని తెలిపారు.

అయితే సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాను అంటూ ఈ సందర్భంగా భాను శ్రీ మెహ్రా చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో పలు వెకేషన్ లకి వెళ్తూ అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన వీడియోలు చూడాలి అంటూ పలువురు సెలబ్రిటీలకు ట్యాగ్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

పెళ్లికూతురు చీరలో శోభిత.. చైతన్య శోభిత కలకాలం సంతోషంగా ఉండాలంటూ?