హైపర్ ఆదిపై ఏడుస్తూ గట్టిగా అరిచేసిన వర్షిణి….!

ఈ మధ్య కాలంలో ఢీ ఛాంపియన్స్ షోలో స్కిట్లు, డ్యాన్సుల ద్వారా పాపులర్ అవుతున్న జోడీల్లో హైపర్ ఆది వర్షిణి జోడీ ఒకటి.

వ్యక్తిగతంగానైనా, షోలలోనైనా వర్షిణి, హైపర్ ఆది ఎప్పుడూ కూల్ గా కనిపిస్తారు.అయితే ఒక ఈవెంట్ కు హైపర్ ఆది, వర్షిణి హాజరు కాగా ఆ ఈవెంట్ లో హైపర్ ఆది, వర్షిణి మధ్య గొడవ చోటు చేసుకుంది.

చాలా నెలల క్రితమే ఈ ఘటన జరిగిందని హైపర్ ఆది, వర్షిణి చెప్పుకొచ్చారు.

ఢీ ఛాంపియన్స్ షో ద్వారా ఇప్పుడు స్నేహితులమైనప్పటికీ ఆస్ట్రేలియాలో ఈవెంట్ లో పెద్ద గొడవ జరిగిందని ఆది అన్నారు.

తనకు ఆ ఈవెంట్ లో పాల్గొన్న మిగతా వాళ్లతో పరిచయం ఉన్నా వర్షిణితో పెద్దగా పరిచయం లేదని ఒకరి పేర్లు మరొకరికి తెలిసినంత పరిచయం మాత్రమేనని అన్నారు.

ఆ సమయంలో వర్షిణి తనపై పంచ్ లు వేయడంతో తనకు విపరీతమైన కోపం వచ్చిందని చెప్పారు.

వర్షిణి ఆదితో అంతకుముందు పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల తాను పంచ్ లు వేయడం తనకు నచ్చలేదని తాను వేసిన పంచ్ లకు హర్ట్ అయిన ఆది అక్కడ కోక్ బాటిల్ ను విసిరేసి వర్షిణిపై పరోక్షంగా సీరియస్ అయ్యాడని చెప్పారు.

ఊహించని ఈ పరిణామానికి తను కూడా గట్టిగా అరిచేసి అక్కడినుంచి బాధ పడుతూ వెళ్లిపోయానని చెప్పారు.

ఆ తరువాత పలు షోలలో, ఈవెంట్లలో కనిపించినా ఒకరికి ఒకరు దూరంగా ఉండేవాళ్లని తెలిపారు.

అయితే అప్పుడు గొడవలు జరిగినా ఢీ ఛాంపియన్స్ షో ద్వారా మళ్లీ కలిశామని.

అప్పుడు శత్రువులుగా మారినా ఇప్పుడు స్నేహితులుగా మారామని వర్షిణి చెప్పుకొచ్చారు.సోషల్ మీడియాలో హైపర్ ఆది, వర్షిణి చెప్పిన మాటలు వైరల్ అవుతుండగా పంచ్ లు వేసే హైపర్ ఆదిపై పంచ్ లు వేసి వర్షిణి కోపం తెప్పించడం విచిత్రంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

నా జీవితాన్ని మార్చేసిన సినిమా అది.. ఎమోషనల్ పోస్ట్ చేసిన బన్నీ?