తొలి ప్రయత్నంలోనే సీఏ పరీక్షలో రెండో ర్యాంక్.. ఈ యువతి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!

మన దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షలలో సీఏ పరీక్ష( CA Exam ) ఒకటి కాగా ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు.

ఈ పరీక్షలో తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించడం సులువు కాదు.సీఏ ర్యాంకర్ వర్ష అరోరా( Varsha Arora ) సక్సెస్ స్టోరీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మే నెలలో సీఏ పరీక్ష నిర్వహించగా ఆ పరీక్షలో వర్ష అరోరా తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

ఢిల్లీకి( Delhi ) చెందిన వర్ష అరోరా సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

బాల్యం నుంచి వర్ష చదువులో ముందువరసలో ఉండేవారు.యూపీఎస్సీ రాసి ప్రజలకు సేవ చేయాలని ఆమె భావించగా ఆమె బీకాం ఆనర్స్ చదివారు.

అయితే తర్వాత యూపీఎస్సీ నుంచి సీఏకు లక్ష్యాన్ని మార్చుకున్న వర్ష ఇంటర్ లో నేర్చుకున్న అంశాలే సీఏ పరీక్ష విషయంలో ఉపయోగపడ్డాయని వెల్లడించడం గమనార్హం.

"""/" / రోజుకు కేవలం మూడు గంటల కోచింగ్ కు వెళ్లి తాను పరీక్ష రాశానని ఆమె చెప్పుకొచ్చారు.

ఫైనల్ ఎగ్జామ్ సమయంలో ఏకంగా 12 నుంచి 14 గంటలు చదివానని వర్ష కామెంట్లు చేశారు.

వర్ష అరోరా తండ్రి ప్రైవేట్ సంస్థలో అకౌంట్స్ మేనేజర్ కావడం గమనార్హం.సీఏ రంగంలో మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని వర్ష అన్నారు.

"""/" / సీఏ ప్రిపరేషన్( CA Preparation ) టైమ్ లో సరైన సమయంలో సరైన ఫుడ్ తీసుకున్నానని ఆమె తెలిపారు.

తల్లీదండ్రుల నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభించిందని ఆమె వెల్లడించారు.సీఏలో సెకండ్ ర్యాంక్( CA Second Ranker ) సాధించిన వర్ష టాలెంట్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని చెప్పవచ్చు.

వర్షా అరోరా ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.వర్షా అరోరా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..