ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచింది ఎవరు....? వర్మ నీకు ఎందుకు ఇంత పగ?
TeluguStop.com
రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాలున్న ఈ చిత్రంకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు వర్మ మొదలు పెట్టాడు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయంను చూపిస్తాను అంటూ వర్మ మొదటి నుండి చెబుతున్నాడు.
ఇక తాజాగా సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచింది ఎవరు అంటూ ప్రశ్నిస్తు హ్యాష్ ట్యాగ్‌ను పోస్ట్ చేసి మరీ పబ్లిసిటీని మొదలు పెట్టాడు.
భారీ ఎత్తున ఈ హ్యాష్ ట్యాగ్‌కు రెస్పాన్స్ వస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
ఒక వైపు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా రాబోతుంది.
ఇప్పుడు ఆ సినిమా గురించి ఎవ్వరు కూడా ఆలోచించడం లేదు.ఇప్పుడంతా కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించే ఆలోచిస్తున్నారు.
వర్మ ఎలా తీసి ఉంటాడు, ఎలాంటి సీన్స్ ఇందులో ఉంటాయి అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.
వర్మ మాత్రం ఈ చిత్రంను పూర్తి వివాదాస్పదంగా చూపించే ప్రయత్నం చేశాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలుగు దేశం పార్టీ పరువును ఎన్నికల ముందు తీసే విధంగా ఈ చిత్రం ఉంటుందని సినీ వర్గాల వారితో పాటు, రాజకీయ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది.
లక్ష్మీ పార్వతి ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రం నందమూరి ఫ్యామిలీలో అప్పట్లో జరిగిన వివాదంను తీసుకు వస్తుంది.
ఇప్పటికే వదిలిన స్టిల్స్, పాటలు, వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.ఇక చివరి అస్త్రం అన్నట్లుగా ఎవరు ఎన్టీఆర్‌ను వెన్ను పోటు పొడిచారు అంటూ వర్మ సందడి చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ఏంటో ఇప్పటికే తెలిసిపోయింది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదలకు కాస్త అటు ఇటుగా విడుదల చేయాలనేది చిత్ర యూనిట్ సభ్యుల ప్రయత్నంగా తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు మరియు బాలకృష్ణలపై ఎంతో పగతో ఈ చిత్రంను వర్మ తీస్తున్నట్లుగా ప్రమోషన్ కార్యక్రమాలు చూస్తుంటే అనిపిస్తోంది.