Ram Gopal Varma : శివ సినిమాలో రఘువరన్ ను రిజెక్ట్ చేసిన వర్మ…మళ్ళీ ఎలా వచ్చాడంటే..?
TeluguStop.com
నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )దర్శకత్వంలో వచ్చిన శివ సినిమా( Shiva Movie ) సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది.
ఇక ఈ సినిమాలో రఘువరన్ విలన్ గా నటించాడు.అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.
ఇక అందులో భాగంగానే ఇండస్ట్రీ లో అప్పటివరకు ఉన్న సినిమా విధానాన్ని మొత్తం మార్చి వేస్తూ ఒక కొత్త తరహా మేకింగ్ కి శ్రీకారం చుట్టిన సినిమా ఇది.
అయితే ఈ సినిమాలో వర్మ విలన్ గా మొదట వేరే వాళ్ళని తీసుకుందాం అనుకున్నాడు.
కానీ అనుకోకుండా రఘువరన్ వచ్చాడు. """/" /
ఇక ఆయన యాక్టింగ్ చూసిన వర్మ తనకు ఎందుకో రఘువరన్( Raghuvaran ) తో సెట్ అవ్వదు అని అనిపించిందట.
కానీ నాగార్జున ( Nagarjuna )ఉండి రఘువరన్ అయితే ఈ క్యారెక్టర్ బాగా చేయగలడు.
అని చెప్పి ఇంకో వర్షన్ లో ట్రై చేయమని చెప్పడట.అప్పుడు వర్మ రఘువరన్ తో ఇంకొక డైలాగ్ చెప్పించి సినిమాని సక్సెస్ చేశాడు.
ఇక ఈ సినిమాలో ఆయన చెప్పిన డైలాగులు గానీ, ఆయన అందించిన విలనిజం కానీ ఇప్పటికీ గుర్తుండిపోతుంది అంటే ఆయన ఎంత మంచి నటుడో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ఆయన నటించిన నటనకు ఆయనకు పేరు తోపాటు, మంచి గుర్తింపు కూడా వచ్చింది.
"""/" /
ఇక ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో రఘువరన్ వరుసగా విలన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఇప్పటికి కూడా శివ సినిమా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రఘువరన్ పేరు ప్రస్తావించ కుండా ఏ ఒక్కరు ఉండరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో వర్మ కూడా ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ అయ్యాడు.