మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేంటో చెప్పండి?

గత కొంత కాలంగా ట్విట్టర్‌లో వైకాపా ఎంపీ, ఆ పార్టీ ముఖ్య నాయకుడు విజయసాయి రెడ్డి మరియు తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత వర్ల రామయ్య మద్య ట్విట్టర్‌ వార్‌ జరుగుతున్న విషయం తెల్సిందే.

వీరిద్దరు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్‌ అయ్యింది.ఇటీవల విజయసాయి రెడ్డి తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశాడు.

హైదరాబాద్‌లో గోల్కొండను, చార్మినార్‌ను, హుస్సేన్‌ సాగర్‌ను కూడా కట్టించింది చంద్రబాబు నాయుడు గారే అంటూ తెలుగు తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు అంటూ ఎద్దేవ చేస్తూ ట్విట్టర్‌లో కామెంట్స్‌ చేశాడు.

విజయసాయి రెడ్డి విమర్శలకు టీడీపీ నాయకుడు వర్ల రామయ్య సమాధానం ఇచ్చాడు.విజయసాయి రెడ్డి గారూ! మీకు "చింత చచ్చినా పులుపు చావలేదు".

చార్మినార్ కట్టింది చంద్రబాబు కాదు.హైటెక్ సిటీ కట్టింది, సైబరాబాద్ నిర్మించింది, హైదరాబాద్ ను సర్వతోముఖాభివృద్ధి చేసింది మాత్రం చంద్రబాబే అని ప్రపంచమంతా తెలుసు.

మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పండి? అంటూ ప్రశ్నించాడు.వైకాపా ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందుబాటులోకి రావడం లేదంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

వీడియో: యముడికే షాక్.. ట్రైన్ కింద కారు నుజ్జునుజ్జు.. డ్రైవర్ మాత్రం సేఫ్..