యావరేజ్ టాక్ తెచ్చుకున్న 100 కోట్ల క్లబ్ లో సంక్రాంతి సినిమాలు!

మన ఇండియన్ సినిమాల దగ్గర పండుగలు వస్తే చాలు.బాక్సాఫీస్ దగ్గర సందడి వాతావరణం కనిపిస్తుంది.

ప్రతీ పండుగకు వరుసగా సినిమాలను రంగంలోకి దించేందుకు మేకర్స్ రెడీ అవుతూ ఉంటారు.

ఇక మన సౌత్ ఇండియాలో సంక్రాంతి అంటే పెద్ద పండుగ అనే చెప్పాలి.

మరి పొంగల్ రేస్ ను స్టార్ హీరోలు అంత త్వరగా వదులుతారా.అస్సలు మిస్ చేసుకోరు.

మరి ఈసారి టాలీవుడ్ లో మాత్రమే కాదు.కోలీవుడ్ లో కూడా పొంగల్ రేస్ లో భారీ పోటీ నెలకొనింది.

తమిళ్ లో విజయ్ దళపతి, అజిత్ కుమార్ ఒకేరోజు బరిలోకి దిగారు.సంక్రాంతి కానుకగా జనవరి 11న ఇద్దరు తమ సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్ర చేసారు.

ఈ రెండు సినిమాలు కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. """/"/ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తునివు' సినిమాతో అజిత్ కుమార్ బరిలోకి దిగగా.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారిసు సినిమాతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమాలు రెండు కూడా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయ్యాయి.

ఈ రెండు సినిమాలకు కూడా మొదటి షో నుండే ఏవరేజ్ టాక్ వచ్చింది.

ఇక తునివు కంటే విజయ్ సినిమాకు కాస్త బెటర్ టాక్ వచ్చింది. """/"/ అయితే సంక్రాంతి సెలవుల కారణం గా ప్రేక్షకులు యావరేజ్ టాక్ వచ్చిన కూడా సినిమాలను చూడడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

దీంతో పండుగ రోజులను సినిమాలు క్యాష్ చేసుకుంటున్నాయి.యావరేజ్ టాక్ వచ్చిన కూడా ఈ రెండు సినిమాలు కోలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పించి 100 కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.

చూడాలి మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత మేర కలెక్షన్స్ రాబడుతుందో.

తండేల్ విషయంలో భారీ రిస్క్ తీసుకున్న నిర్మాతలు.. చైతన్య సాయిపల్లవి ఏం చేస్తారో?