ఆవు పేడతో వెరైటీగా ఆభరణాలు.. ప్రపంచ దేశాల్లో విపరీతమైన డిమాండ్..
TeluguStop.com
ఈ సృష్టిలో పనికి రానిది అంటూ ఏదీ ఉండదు.సరైన ఆలోచన, ఆవిష్కరణలను, పట్టుదలతో అమలు చేస్తే ఖచ్చితంగా విజయం సొంతం అవుతుంది.
దీనిని మధ్యప్రదేశ్ భోపాల్‌కు చెందిన నీతాదీప్ బాజ్‌పాయ్ నమ్మారు.ఆవు పేడతో( Cow Dung ) ఆమె ఆభరణాల తయారీ ప్రారంభించారు.
దానితో ఫ్యాబ్రిక్ ఆభరణాలు, గాజులు, చెవి పోగులు వంటివి తయారు చేశారు.అంతేకాకుండా శివుడు, గణేశుడు విగ్రహాలను ఆకర్షణీయంగా రూపొందించారు.
ఈ ఉత్పత్తులకు దేశ విదేశాల్లో భారీగా డిమాండ్ ఏర్పడింది.దీంతో విదేశాలకు సైతం వారు ఎగుమతి చేస్తున్నారు.
అమెరికా, జర్మనీ, దుబాయ్( America, Germany, Dubai) వంటి ఎన్నో దేశాలలో ఈ ఉత్పత్తులను ఎనలేని డిమాండ్ ఉంది.
అయితే నీతాదీప్‌కు ఇదంతా సులువుగా ఏమీ జరగలేదు.2014లో ఆమె భర్త చనిపోయారు.
దీంతో ఆమె కుమిలిపోయింది.ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో తోచలేదు.
చివరికి ధైర్యంగా ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. """/" /
భర్త చనిపోయిన తర్వాత నీతా దీప్ ( Neeta Deep )ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది.
దీంతో ఆ సమయంలో ఆమె కేవలం రూ.10 వేల రూపాయలతో ఈ వ్యాపారం ప్రారంభించింది.
ద్విపాంజలి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సొసైటీని( Dwipanjali Art And Craft Society ) లాంఛ్ చేసి ఆవు పేడతో ఆకర్షణీయమైన అలంకరణ సామగ్రిని తయారు చేయడం మొదలు పెట్టింది.
తన ఉత్పత్తులను ఆమె పలు ప్రాంతాల్లో ప్రదర్శనకు పెట్టింది.ఆ సమయంలో కస్టమర్ల నుంచి చక్కటి స్పందన రావడం, వ్యాపారం లాభసాటిగా మారడంతో మరింత విజయం సాధించింది.
అయితే ఈ వ్యాపారం ఇతర మహిళలకు కూడా ఉపాధి లభించాలని ఆమె తలంచింది.
300ల మంది మహిళలకు ఉపాధి కల్పించి, ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించింది.రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఆమె సర్వే చేపట్టింది.
"""/" /
చాలా మంది మహిళలతో ఇంటింటికీ వెళ్లి మాట్లాడింది.పని వారికి స్వయంగా ఆమె నేర్పింది.
అందులో వారు నైపుణ్యం సంపాదించాక ఉత్పత్తులను మరింత మార్కెటింగ్ చేసింది.చీరలపై ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడం కూడా వారికి ఆమె నేర్పించారు.
ఇక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో డిప్లొమా చేయడం ఈ వ్యాపారంలో నీతాకు బాగా ఉపయోగపడింది.
తమ ఉత్పత్తుల కనీస ధర రూ.10 నుంచి మొదలువుతుందని, రూ.
250 వరకు ఉంటుందని ఆమె తెలిపింది.ప్రస్తుతం వార్షిక టర్నోవర్ ఆశాజనకంగా ఉందని సంతోషంగా ఆమె చెప్పింది.
క సినిమాకు అదే హైలెట్.. చివరి 10 నిమిషాలు వేరే లెవెల్ లో ఉండబోతుందా?