అదరహో ఘుమ ఘుమలు ! వైసీపీ బీసీ సభకు భారీగా వెరైటీలు !
TeluguStop.com
జయహో బీసీ సభ పేరుతో వైసిపి విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సామాజిక వర్గంలో కదలిక తీసుకువచ్చి దానిని వైసీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు ఈరోజు విజయవాడలో సభను ఏర్పాటు చేశారు.
ఈ సభకు బీసీ కులాలకు చెందిన వారిలో పదవులు పొందిన వారు, ఆ సామాజిక వర్గంలో కీలకంగా ఉన్న వారంతా హాజరయ్యారు.
అలాగే వైసిపి ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు పొందిన కార్పొరేషన్ డైరెక్టర్లు , మున్సిపల్ వార్డు మెంబర్లు, చైర్మన్లు ,మేయర్లు, కార్పొరేటర్లు, పంచాయతీ సర్పంచులు, వివిధ బీసీ కార్పొరేషన్ ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇలా దాదాపు 80,000 మందిని పైగా ఆహ్వానించారు.
వీరితోపాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసిపి కార్యకర్తలు హాజరు కాబోతున్నారు.ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా వైసిపి నిర్వహిస్తూ ఉండడంతో దీనికి భారీగానే ఏర్పాట్లు చేశారు.
ముఖ్యంగా నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు.ఉదయం టిఫిన్ కింద ఇడ్లీ, గారే, మసాలా ఉప్మా, పొంగలిని అందించారు.
సాంబారు కొబ్బరి చెట్నీ టమోటో చట్నీ ,రవ్వ కేసరి తో పాటు టీ, కాఫీలను ఉదయం అందించగా, మధ్యాహ్నం భోజనం కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు.
ముఖ్యంగా మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ ఫిష్ ఫ్రై, రొయ్యల కోడిగుడ్డు ,చేపల పులుసు, """/"/ కట్టా, ఉల్లి చట్నీ, వైట్ రైస్, పెరుగు, చక్కెర పొంగలి, పనసకాయ దమ్ వెజ్ బిర్యాని, పన్నీర్, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, టమాటా పప్పు, గోంగూర పచ్చడి, వైట్ రైస్, సాంబారు, చక్కెర, పెరుగు, చక్కెర పొంగలి వీటితో పాటు వాటర్ బాటిల్ అందించబోతున్నారు.
ఈ సభ కు హాజరయ్యే వారికి నోరూరించే వంటకాలను సిద్ధం చేసేందుకు ఆంధ్ర, తెలంగాణకు చెందిన పేరున్న వంట మాస్టర్లను రంగంలోకి దించారు.
ఎక్కడా, ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.వందలమంది కీలక నాయకులకు వీటి బాధ్యతలను అప్పగించారు.
రామ్ చరణ్ దర్గాకు వెళ్లడంపై తనికెళ్ల భరణి రియాక్షన్ ఇదే.. ఆయన ఏమన్నారంటే?