వెరైటీ ఫుడ్.. గొడుగులు, చెప్పులు, పర్సులు తినేయొచ్చు

చిన్న పిల్లలకు ఆహారాన్ని తినిపించేందుకు పెద్దలు చాలా కష్టపడుతుంటారు.అయితే రంగురంగుల్లో ఉండే ఆహారాన్ని చూడగానే పిల్లలు ఇష్టపడుతుంటారు.

రుచిగా ఉండడంతో పాటు కళ్లకు ఇంపుగా కనిపించే ఆహార పదార్థాలు పిల్లలను ఎక్కువగా ఆకర్షిస్తాయి.

దీనిని దృష్టిలో ఉంచుకుని క్రియేటివ్‌ బేకర్లు ( Creative Bakers )తమ ప్రతిభకు పదును పెడుతున్నారు.

బేకరీ ఫుడ్‌( Bakery Food )ను రకరకాల రూపంలో తయారు చేస్తున్నారు.వీటిని చూడగానే పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా నోరూరుతుంది.

హఠాత్తుగా వీటి గురించి తెలియని వారు షాక్ అవుతున్నారు.చెప్పులు, గొడుగులు, హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సులు ఇలా రకరకాల్లో బేకరీ ఫుడ్ తయారు చేస్తున్నారు.

ఇలా ఫుడ్‌కు ఫ్యాషన్ జోడించి కొత్త రూపాల్లో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు.

"""/" / ఆహారం విషయంలో ప్రస్తుత ఆధునిక కాలపు యువత రాజీ పడడం లేదు.

వైవిధ్యమైన రుచులు, ఆహార పదార్థాలు, వాటి వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆరా తీస్తున్నారు.

ఎక్కడ వెరైటీ ఫుడ్ కనిపించినా వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు.ముఖ్యంగా బేకరీ ఫుడ్‌ను రకరకాలుగా క్రియేటివ్‌ బేకర్లు తయారు చేస్తున్నారు.

ఈ నవతరం వంటగాళ్లు చేసే చెప్పుల రూపంలో """/" /ఉండే కేకులు, డ్రెస్సుల మాదిరిగా ఉండే బిస్కెట్లు ఇతర ఫుడ్ ఐటమ్స్ రుచికి కూడా చాలా బాగుంటాయి.

రంగురంగుల రుచుల్లో విభిన్న రూపంలో చేస్తున్న బేకరీ ఫుడ్స్‌కి విపరీతమైన డిమాండ్ ఉంటోంది.

అయితే వీటిని ఇంట్లో తయారు చేయడం పెద్ద విశేషమేమీ కాదు.యూట్యూబ్, ఫుడ్ బ్లాగుల్లో వీటిని ఎలా తయారు చేయాలో వివరించే వీడియోలు ఉంటాయి.

వాటి సాయంతో ఇంట్లోనే మహిళలు తమ పిల్లలకు వెరైటీ ఫుడ్ వండి పెట్టేయొచ్చు.

ఇండస్ట్రీలో సెలబ్రెటీలపై రూమర్స్ పుట్టించేది వాళ్లే: సోనాలి బింద్రే