సిక్కోలు జిల్లాలో వేరైటి దేవినవరాత్రుల మండపం

సిక్కోలు జిల్లాలో వేరైటి దేవినవరాత్రుల మండపం చూపరలను విశేషంగా ఆకర్షిస్తోంది .శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం ఎర్రముక్కం గ్రామంలో ప్రతి ఏటా ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు .

అయితే గత ఏడాది కరోనాతో ఉత్సవాలకు బ్రేక్ పడటంతో ఈసంవత్సరం వెరైటిగా మండపాన్ని నిర్మించాలని ప్లాన్ చేసారు.

దినిలో బాగంగా కరోనా వైరస్ విజృంభిస్తోందని ప్రతి ఒక్కరు ఇంటి వద్ద ఉండాలని జాగ్రత్త పాటించాలని అనే సందేశం అందరికి తెలియజేసే విధంగా దుర్గమ్మ మండపం ఇల్లు ఆకారంలో నిర్మించారు.

ఈ వెరైటి మండపాన్ని చూసేందుకు చుట్టప్రక్కల గ్రామాలనుంచి సైతం వస్తున్నారు.

మహా కుంభమేళాకు గ్లోబల్ రేంజ్‌లో ప్రచారం.. ఎన్ఆర్ఐ మహిళపై ప్రశంసలు