వారసుడు మూవీ సెన్సార్ టాక్ ఇదే.. విజయ్ ఖాతాలో మరో హిట్ అంటూ?

2023 సంక్రాంతి సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు వారసుడు పోటీనివ్వడం సాధ్యమేనా అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి.

వారసుడు మూవీ ప్రమోషన్లలో వేగం పెరగకపోవడంతో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీగా కలెక్షన్లను సాధించడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే తాజాగా వారసుడు మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుండటం గమనార్హం.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కగా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉందని సెన్సార్ సభ్యులు ఈ సినిమా విషయంలో రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది.

వారసుడు సినిమాతో విజయ్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

విజయ్ గత సినిమా బీస్ట్ ప్రేక్షకులను మెప్పించలేదు.వారసుడు సినిమాలో విజయ్ కు జోడీగా రష్మిక నటించగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ రావాల్సి ఉంది.

రష్మిక తెలుగులో ఇప్పటికే స్టార్ హీరోయిన్ కాగా తమిళంలో కూడా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవాలని రష్మిక కోరుకుంటున్నారు.

"""/"/ వారసుడు సినిమా సక్సెస్ సాధిస్తే తమిళ ప్రేక్షకులు సైతం రష్మిక యాక్టింగ్ కు ఫిదా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

రష్మిక ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలపై నెగిటివ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ఆమెకు ఒకింత మైనస్ అయ్యాయి.

వారసుడు సినిమాకు తమిళనాడు కలెక్షన్లు కీలకం కాగా వంశీ పైడిపల్లి కూడా ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తుండటం గమనార్హం.

సాహో టీమిండియా.. రెండోసారి ప్రపంచకప్ కైవసం..